ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 17: ఉప్పల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పెంచిన బండారి లక్ష్మారెడ్డి , గురువారం ఉప్పల్ సర్కిల్లోని రామంతపూర్ డివిజన్ లో, వాసవి నగర్, కామాక్షిపురం, వివేక్ నగర్, శ్రీనివాసపురం ఈస్ట్, ఓల్డ్ రామంతాపుర్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఈ సందర్బంగా పలు కాలనీల ప్రజలు జనసంద్రంగా తరలివచ్చి, పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ నేథ్యంలో బండారి లక్ష్మారెడ్డి గారికి, రామంతాపూర్ డివిజన్ ప్రజలు వీర తిలకం దిద్ది, మంగళ హారతులతో విజయోస్తి అంటు దీవించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి ప్రచారం చేస్తూ, ప్రభుత్వ పథకాలను, కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమాను, మేనిఫెస్టోను ప్రజలకు స్పష్టంగా వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజాదరణతో ముందుకు సాగుతూ చిరు వ్యాపారులను కలుసి బట్టల షాపులో మిషిన్ కుట్టి, హోటల్లో పూరీలు వేసి, మీ పనిలో సాయపడతానంటూ వారి ఓట్లు తనకు వెయ్యాలని అభ్యర్ధించారు. ఉప్పల్ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ పాదయాత్రలో రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.