షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 17: షాద్ నగర్ నియోజకవర్గం లోని కోందుర్గు మండలం ఉమ్మెంత్యాల, లాలాపేట గ్రామాల్లో భారీ ప్రచారం
కాంగ్రెస్ “ధాటి కి బి ర్ స్ కొట్టుకోపోతుందనీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో (హస్తం) విడుదలయ్యిందని షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్ధి “వీర్లపల్లి శంకర్” అన్నారు. కోందుర్గు మండలం ఉమ్మెంత్యాల, లాలాపేట గ్రామాల్లో కాంగ్రెస్ భారీ ప్రచారం చేపట్టింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రచారం నిర్వహించగా మహిళలు ప్రజలు ఆటపాటలతో వీర్లపల్లి శంకర్ కు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్లెట్ ‘అభయ హస్తం’ను విడుదల చేశారని ఇది ఎంతో శుభ సూచకమని అన్నారు. అభయ హస్తంలో 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్క్యాలెండర్లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం 42 పేజీలతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే సామాజిక ప్రజల మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారనీ పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారనీ నమ్ముకున్నవారికి ద్రోహం చేశారనీ… పదేళ్లలో ఒక అహంకార పూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారనీ వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారనీ, తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందనీ మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారన్నారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నామని.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని శంకర్ ధీమా వ్యక్తం చేసారు.