ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 17 : బందుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బొంద పెడతారని కొడంగల్ మాజి ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అన్నారు దౌల్తాబాద్ మండలం బాలంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి 15 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని గురునాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ దత్తత పేరిట కొడంగల్ నియోజకవర్గాన్ని మోసం చేసిన కెసిఆర్ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కొడంగల్ నియోజకవర్గ బీడు భూములకు సాగునీరు అందిస్తామని కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అబద్ధపు హామీలతో మోసం చేసి ఏ మొహంతో బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారని అన్నారు దళిత బంధు బీసీ బందు మైనారిటీ బందుల పేరిట ప్రజలను మోసం చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వనీదేనని ఎద్దేవా చేశారు ఉద్యమకారుల పోరాటాల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీరోచిత పోరాటాలను చేసిన ఉద్యమకారులను బీఆర్ఎస్ విస్మరించిందని అన్నారు పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అరాచక పాలన కొనసాగుతుందనీ ఈ అరాచక పాలనను అంతమొందించాలంటే యువకులు గట్టిగా పోరాడాలని ప్రధానంగా బాలంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తుందని ఈ ఉత్సాహాన్ని ఇలాగే ఎన్నికల వరకు కొనసాగించి హస్తం గుర్తుకు ఓటు వేసి బాలంపేట గ్రామం నుంచి రేవంత్ రెడ్డి కి అత్యధిక మెజార్టీని ఇచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రినీ చేద్దామని అన్నారు పార్టీలో చేరిన వారిలో బ్యాగరి మొగులప్ప హరిజన అనంతప్ప బ్యాగరి చిన్న మొగులప్ప నొసులై వెంకటప్ప గుర్రం కాశప్ప ఆటో కృష్ణ బ్యాగరి ఉషనప్ప బ్యాగరి గుండప్ప బ్యాగరి శ్రీను గుర్రం మహేష్ తెలంగాణ ఉద్యమకారుడు లాల్ అహ్మద్ బ్యాగరి రాములు హరిజన్ సాయిలు కటికె శంకర్ జి హరిజన్ అనిల్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు యువకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.