హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : బిఆర్ఎస్ పార్టీకే మాలల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట మాల సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచెందర్ మాట్లాడుతూ తెలగాణ రాష్ట్రంలో ఉన్న మాలల సమస్యలను పరిష్కారిస్తామన్న బిఆర్ఎస్ పార్టీకే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఅరెస్ ప్రభుత్వం అని అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచ మేదావి భారత రాజ్యాంగ పితామహుడు, భారత రత్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డా.బిఆర్ అంబేడ్కర్ పేరును పెట్టడం శుభ సూచికంగ బావిస్తున్నామని అన్నారు. ధళిత బంధు పథకం ద్వారా ధళితులు వ్యాపార వేత్తలుగా అభివృద్ధి చెందడానికి ధళితబందు పథకం అద్భుతంగా ఉందని అన్నారు. కులాలకు, మతాలకు, అతీతంగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆడపిల్లల పెళ్ళిళ్ళ(వివాహాం) కోసం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం ఎంతో మందికి ఉపయోగ పడుతుందని అన్నారు. పేదలకు వృద్ధ ప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రైతులకు రైతు బందు, రైతు భీమా, రుణమాఫీ, అందిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిందన్నారు. ఎంతో మందికి కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం ఎంతో అద్భుతం అన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి,మైనారిటీల విద్యార్థులకు గురుకుల పాఠశాలలు స్థాపించి లక్ష మంది విద్యార్థులకు ఉచిత విద్య ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ఇలా అనేక సంక్షేమ పతకాలు ద్వారా ప్రజలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మళ్ళీ బిఆరెస్ అధికారాన్ని చేపట్టాలంటే ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలు అందరూ కారు గుర్తుకే ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తీర్మానం చేసి బిఆరెస్ కె మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో కన్వీనర్ నల్లాల కనకరాజు, వర్కింగ్ చైర్మన్ తాళ్లపల్లి రవి, జి.వినోద్ కుమార్, ఎం.నర్సింహా, ఎం.వెంకన్న, బి.కిషన్, కో-చైర్మన్ లు జి.సత్యనారాయణ, కె.గోపాల్, ఎన్.బాబు రావు, తదితరులు పాల్గొన్నారు.