ప్రజల అభ్యున్నతికి పాటుపడేది బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజల అభ్యున్నతికి పాడుపడతారని ప్రజల సంక్షేమం అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి గుర్క జైపాల్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహంచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి. పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ. కారు గుర్తుకు ఓటు వేసి జైపాల్ యాదవ్ ను  భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కో ఆప్షన్ మెంబర్ ముజిబూర్ రెహమాన్, బీ.ఆర్.ఎస్ నాయకులు నరేందర్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యులు యాదయ్య, విజయ్ కుమార్, దస్తగిరి, (గౌస్) ప్రొద్దుటూరు రాజు, పరందాములు,  గోవర్ధన్ గౌడ్, బుచ్చయ్య, సుల్తాన్, రమేష్ యాదవ్, సుధాకర్, చెన్నకేశవులు, వెంకటయ్య యాదవ్, సంపత్ కుమార్, లింగం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page