ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 17: ఎల్ .బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోఎన్నికల శంఖారావం ప్రారంభంలో బాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కొత్తపేట డివిజన్ పరిధిలోని జైన్ మందిర్ నుంచి స్నేహపురి కాలనీ వరకు ఇంటీంటి ప్రచారం చేపట్టారు. సుధీర్ రెడ్డి ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా డప్పు చప్పుళ్లు, ఆటలు, పులవర్షంతో ఆదరిస్తూ మహిళలు మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పులమలాలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొన్నిచోట్ల కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, బస్తీవాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేస్తామని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి ప్రజలను కలుస్తూ, కళ్లముందు ఉన్న అభివృద్ధి పనులు చెప్తూ, తనని పూర్తి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్దే ధ్యేయంగా అడుగులు వేస్తున్నానీ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులకు చెప్పుకోటానికి ఏమిలేక ఏదోవిధంగా గెలిచి ఆదాయం పెంచుకోవాలనే ఆశతో ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకొనివెళ్తానని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఏమి అభివృద్ధి పనులు చేయాలో ముందే పక్క ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గం మీద పట్టు లేని నాయకుల మాటలు నమ్మవద్దని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్ గుప్తా, సీనియర్ నాయకులు లింగాల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్, చైతన్యపూరి డివిజన్ అధ్యక్షులు మహేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు శ్వేత రెడ్డి, మహేష్ రెడ్డి, ఉదయ్, యాదగిరి, సాయి కుమార్ గౌడ్, వరుణ్, డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, వివిధ విభాగాల కమిటీ సభ్యులు, పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.