ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 16 : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నియంత పోకడల వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా తలా ఓ దారి  చూసుకుంటున్నారని అండం విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ కూడ పట్టించుకున్న పాపాన పోలేదని ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే టికెట్ కోసం వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులను మోసం చేసినటువంటి వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి అని అన్నారు.అసలు ఆయన కాంగ్రెస్ ఏ కాదని,బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఏనాడు కూడా ఉద్యమం చేసిన పాపానపోలేదని ఎన్నడు నిలదీసింది లేదని ఆయన విమర్శించారు.కార్యకర్తలను ఉత్సాహంగా పలకరించింది లేదు.యాచారం మండలంలో ఫార్మాసిటీ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అయిన కోదండ రెడ్డిని చిన్న చూపు చూసిన మల్రెడ్డి రంగారెడ్డి కోదండరెడ్డి ఫార్మాసిటీ పోరాటం కోసము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు విక్రమార్కని, అదేవిధంగా మొత్తం క్యాడర్ను తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేయడానికి సన్నద్ధమైతే ఇదే మల్రెడ్డి రంగారెడ్డి ఎవర్ని రానీయకుండా అడ్డుపడిన రోజు ఎవరు మర్చిపోరని ఆయన మండి పడ్డారు.యాచారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అని తెలుసుకోవాలనిమూడుసార్లు మూడు పార్టీలతో ఘోరంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డితో  ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డికి ఇంకా సిగ్గు రాలేదా?మల్రెడ్డి రంగారెడ్డి నాలుగోసారి ఇబ్రహీంపట్నం ప్రజలు ఎలా ఓటు వేస్తారని అనుకుంటున్నారని అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీని 15 సంవత్సరాల పాటు సర్వనాశనం చేసి మల్ల వచ్చి సిగ్గు శరం  లేకుండా టిపిసిసి అధ్యక్షుని అడ్డం పెట్టుకొని బిసిలకు రావాల్సిన టికెట్ ను మల్ రెడ్డి రంగారెడ్డి తెచ్చుకొని నేడు బిసిలకు అన్యాయం చేసిన వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.అతనికి బిసిలందరూ ఓట్లు ఎట్లా వేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.మంచి రెడ్డి కిషన్ రెడ్డితో చాలెంజ్ చేసి నయ్యీంతో కుమ్ముకయ్యా భూములన్ని కబ్జా చేసావని నీకు దమ్ముంటే రా డాగ్ బంగ్లాకు చౌరస్తాకు అని సవాల్ విసిరిన మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోజు మంచి రెడ్డి కిషన్ రెడ్డి వచ్చి డాగ్ బంగ్లాలో కూర్చుని రమ్మని పిలిస్తే ఆడదానిలా ఇంట్లో కూర్చుని ఒక టీవీ ఛానల్కూ డబ్బులు ఇచ్చి పిలిపించుకొని ముఖం చాటేసిన నీవు మళ్లీ ఎలక్షన్ లో నిలబడడానికి సిగ్గు అనిపించట్లేద అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.మేము నియంత పోకడలను భరించలేక కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరి నిన్ను మల్ రెడ్డి రంగారెడ్డిని ఓడలించడానికి అని అన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి నీవు బిఆర్ఎస్ పార్టీలో నుంచి నాయకులను కార్యకర్తలను మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారాని ఏదైతే అనుకుంటున్నావో వాళ్లనే బూత్ కమిటీలుగా నియమించి వాళ్లను ఏదైతే వాడుకోవాలని చూస్తున్నావో అదంతా నీ భ్రమ గుర్తుంచుకో అని సవాల్ విసిరారు.బిఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి నాయకుడు ఒక్కొక్క 100 ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి వేయించడానికి నిన్ను ఓడగొట్టడానికి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారమన్నారు.నాలుగోసారి ఓడిపోయి తిరిగి ఇంకొకసారి ఇబ్రహీంపట్నం చరిత్రలో నీవు కనబడకూడదనే మా ఆలోచనతో తాము బిఆర్ఎస్ పార్టీలో చేరినామని విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేశారు.మల్ రెడ్డి రంగారెడ్డి వెంట ఉన్న కాంగ్రెస్ కేడర్ ఎంత అయితే నీ వెంబడుందో అందులో సగం మంది బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.అది నువ్వు తెలుసుకో లేనప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకుడివే కావు గుర్తుంచుకో అని అన్నారు.మంచాల మండలం జడ్పిటిసి నిరంజన్ రెడ్డి ఫోర్ లీడర్ అవుదాం అంటే అతని ప్లొర్ లీడర్ కానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పనినడి నిజం కాదా అని ప్రశ్నించారు.ఆదిభట్ల మున్సిపాలిటీ లో చైర్మన్ కావడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నాం నీకు సిగ్గు అనిపించలేదా అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నంలో ఏకగ్రీవంగా 5 మున్సిపాలిటీ కౌన్సిలర్లను బి ఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అంటే నీవు బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు ఫోలేదని ఎలా అనుకుటుంటామని ఆయన ఆరొపించారు.
యాచారం మండలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిస్తే బిజెపి పార్టీని మండల ప్రెసిడెంట్ చేస్తావ్ ఇది ఎంతవరకు సమంజసమని, ఎన్ని పార్టీలతో కలిసి  సమానత్వంగా పనిచేస్తున్నావనిది ప్రజలకు తెలియదా అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.పెద్ద అంబర్పేట్ లో,అబ్దుల్లాపూర్మెట్ లో, నీకున్న క్యాడర్తో  నీకు ఏ విధంగా ఓట్లు పడతాయని ఆలోచిస్తున్నావని ని వెంట ఉన్న క్యాడర్ నీకు కచ్చితంగా పనిచేయదని తెలిసి కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్నావంటే కాంగ్రెస్ పార్టీలో ఓట్లు పడతాయని దురాలోచనతో వచ్చావని దుయ్యబట్టారు.నిన్ను ఇబ్రహీంపట్నం సమాజం ఒప్పుకోరు నీ సెటిల్మెంట్లు నీ రౌడీయిజం రోజు వారి మామూలు,వసూలు చేయడం భూములు కబ్జాలు చేయడం ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుసన్నారు.
మిమ్మల్ని తరిమికొట్టే రోజు ప్రజలు ఎదురుచూస్తున్నారనేది మర్చిపోవద్దని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు అందర్నీ దూరం చేసి బిఆర్ఎస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లను దగ్గర తీసుకొని గెలుస్తానని నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో నీకు సరైన బుద్ధి చెప్తామని,బిఆర్ఎస్ను గెలిపిస్తాం ఖబర్దార్  మల్ రెడ్డి రంగారెడ్డి అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page