వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 15: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ బిజెపి చేరడం జరుగుతుందని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి సుభాష్ రెడ్డి రామేశ్వర్ ల ఆధ్వర్యంలో ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మురళి గుప్తా టీ మల్లన్న వేద ప్రకాష్ హనుమంతు టీ కృష్ణ రామయ్య కే రామయ్య వై సుభాష్ నిరంజన్ రెడ్డి వీరన్న సురేష్ జగదీష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీరని మోసానికి గురి చేశారని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూములు రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు ఇలా చెప్పుకుంటూ పోతే 100 హామీలకు పైగా ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చకుండా రైతులను పేద ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినట్లు వేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు వారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలతోపాటు పేదల అభివృద్ధికి అవసరమాకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాయమాటలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తెలిపారు. ప్రతి నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పవనాలు ఇస్తున్నాయని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టడం ఖాయమని ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.