కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 15: జగదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మ్యాన్ పేస్టో ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంటూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, కేసీఆర్ చెప్పే కాళ్ళ బొల్లు మాటలు ప్రజలు నమ్మి ఓటు వేస్తె మరింతగా నట్టింటా ముంచుతరని అన్నారు.తెలంగాణ రాష్ట్రo ప్రజలు బీ ఆర్ యస్ పార్టీ ఓడిపోవడం ఖాయం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమం లో లక్ష్మరెడ్డి, ధర్మారం మల్లేశం,న్యాలమడుగు హనుమంత రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి,కాంప్లెక్స్ నర్సింహారెడ్డి,
మల్లికార్జున రెడ్డి, కొత్త శ్రీనివాస్ రెడ్డి, గుబ్బ శ్రీనివాస్, పాషా, అజిజ్, అబ్బు , ఉదయ్, అమర రాము, బిక్షపతి, శ్రీ రామ్, దండే వెంకటేష్,గాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,బాలయ్య,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page