కౌంట్‌  ‌డౌన్‌..17 ప్రజా‘తంత్రం’

అస్తిత్వ పోరులో అన్ని పార్టీలు
రహస్య పొత్తులంటూ లీకులు
పైకి మాత్రం పోటాపోటీ రంకెలు
సై అంటే సై అంటూ చిందులు

టెన్షన్‌ ‌పెడుతోన్న హంగ్‌ ‌వార్తలు
పూర్తి మెజారిటీపై పలు ప్రశ్నలు
అందుకేనట చీకటి ఒప్పందాలు
నోరెళ్లబెడుతున్న ఊసరవెల్లులు
– వి.రమేష్‌ ‌బాబు

పార్టీల ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగింది. బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరావు పేట, భద్రాచలం, పినపాక, వరంగల్‌ ‌జిల్లా నర్సంపేట నియోజక వర్గాల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ‘‘దళితుల కోసం స్వాతంత్య్రం వొచ్చిన నాటి నుంచే స్పెషల్‌ ‌గ్రోత్‌ ఇం‌జన్లు పెట్టి ఉంటే వాళ్ల బతుకులు ఇట్ల ఉండేది కాదు. వారిని వృద్ధిలోకి తెచ్చుకునేందుకే దళితబంధు పథకం తెచ్చినాం.10 సంవత్సరాల పరిస్థితి, బీఆర్‌ఎస్‌ ‌పాలన మీ కండ్ల ముందు ఉంది …విచక్షణతో వోటు వేయాలని కేసీఆర్‌ ‌సూచించారు. తన స్వంత నియోజకవర్గం కొడంగల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. పేదలపై వరాలు జల్లు కురిపించారు.

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే పేదలు, మహిళలు, రైతులు, భూమిలేని వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘లక్షలాది ప్రజల ప్రజాస్వామిక పోరాటం ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాలరాసి, నిరంకుశ పాలనతో, ఆవినీతితో ప్రజల వనరులను దోపిడీ చేస్తూ, విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీని రాష్ట్ర పౌరులు గట్టిగా వ్యతిరేకించాలి. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే ప్రజలు పాలకులకు గుణపాఠం చెప్పే విధంగా ఈ ఎన్నికలలో తమ వోటును వాడుకోవాలి,’’ అని ప్రజా ఉద్యమాల ప్రముఖులు పిలుపును ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని పౌర సమాజ వేదికల ముఖ్యులందరూ కలిసి హైదరాబాద్‌ ‌సామాజి గూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో   ప్రెస్‌ ‌మీట్‌ ‌నిర్వహించి తెలంగాణ పౌరులకు ఉమ్మడి పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page