కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని కందుకూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పేర్కొన్నారు.సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గత పది సంవత్సరాల నుండి తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.పది సంవత్సరాల కాలంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని,ఆయన కుటుంబంలో మాత్రమే లబ్ధి చేకూరిందని ఆయన ప్రజలకు విడమర్చి తెలియజేశారు. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక రోడ్డుపాలైన పట్టించుకోని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని,ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తే యువకులకు ఉద్యోగాలు ఏమోగానీ ప్రజలు రజాకారుల పాలనలో ఏ విధంగా మగ్గారో ఆ విధంగా మగ్గవలసి వస్తుందని ఆయన అన్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తిస్థాయిలో సానుభూతిగా ఉన్నారని ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్,బిజెపిలు కనుమరుగు కావడం ఖాయమన్నారు.ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు,ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పక్షాన ఉన్నారని ఆయన పేర్కొన్నారు.ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page