తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 13: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం లోని కుప్పన్ కోట్ తండా, మాల్కన్ గిరి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు. తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత బీఅర్ఎస్ దేనని జెడ్పీటీసీ ప్రమోదిని అన్నారు. బీఅర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ఆమె తండా వాసులకు వివారించారు. మూడవసారి కేసిఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ తాండూరులో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గా అవగానే అమలు చేసే మానిఫెస్టో తెలియజేశారు. ప్రతి తండాకు 2 సంవత్సరాల్లో రూ.50 లక్షలు మంజూరు చేసింది ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కనీస సదుపయాలు లేక తండా వాసులు ఇబ్బంది చూసి బీ అర్ ఎస్ పార్టీ వచ్చాక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తుందన్నారు.ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారా కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సిరెడ్డి వెంకటరామిరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.