సర్వేలు గిర్వేలు విచిత్రపు తంతు
ఏదీ సర్వేజనా సుఖినోభవంతు?
సమస్యల నివేదనే మనదైన గొంతు
తీర్చగలవారే సమర్ధుల బాపతు!
ఐదేళ్ల పిదప వస్తుంది మన వంతు
ఎన్నికలపర్వం ఒకానొక గమ్మత్తు
ఎంతెంతో కీలకం చదరంగపుటెత్తు
స్వార్థరాజకీయాన్ని చేయాలి చిత్తు
– వి.రమేష్ బాబు
రాష్ట్ర ఎన్నికల అధికారి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు,ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ బీఆర్ ఎస్ అనుకూలంగా పనిచేస్తున్నాయని ఫిర్యాదు చేసారు. బీఆర్ ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. బెల్లంపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ చాలా చైతన్యవంతంగా ఉంటూ ఉద్యమాలు జరిగిన ప్రాంతం బెల్లంపల్లి..ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పార్టీ గత చరిత్ర ఏంటి? వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకేం చేసారు? ప్రజల గురించి ఏం ఆలోచిస్తారో గమనించాలి అని సూచించారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో ప్రజలే తేల్చుకోవాలని ..బీసీ సీఎం అంటున్న బీజేపీ ముందు గుజరాత్ లో బీసీ ని సీఎం చేయాలి అని రేవంత్ అన్నారు.బీజేపీ ముఖ్యనాయకుడు ఈటల రాజేందర్ భూపాల్ పల్లి నియోజక వర్గం ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రజలకి సేవ చేయడానికి ఆరు ఫీట్లు అక్కరలేదు, రంగు అక్కరలేదు. మనసు ఉంటే చాలు అన్నారు. రేపు బీఆర్ ఎస్ అధినేత గజ్వెల్ లో నామినేషన్, బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మంత్రి హరీష్ రావు కేసీఆర్ ను ఏకే 47 తో పోల్చారు.