జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు…:అమర్ ఆధ్వర్యంలో సిఎం జగన్కు జర్నలిస్టుల కృతజ్ఞతలు
అమరావతి,నవంబరు8: జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ను జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు అభినందించారు. క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్రు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడవిూ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ విూడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి వి ఆర్ కృష్ణంరాజు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి విజయ్ భాస్కర్, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కె బి జి తిలక్, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి దారా గోపి, ది హిందూ ప్రతినిధి అప్పాజీ రెడ్డిమ్, దక్కన్ క్రానికల్ ప్రతినిధి ఎండీ ఇలియాస్, ఎన్టీవీ ప్రతినిధి రెహానా, టీవీ 9 ప్రతినిధి ఎస్ హసీనా, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, సాక్షి దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ ఎం రమణమూర్తి పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వీరితో పాటు ఉన్నారు.