బీఆర్‌ఎస్ పార్టీలో వలసల జోరు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 8 :  బీఆర్‌ఎస్ పార్టీ వలసలతో జోరందుకుంటున్నది.బుధవారం ఇబ్రహీంపల్లి గ్రామ రెవెన్యూలోని బర్కల రాంరెడ్డి ఫాం హౌస్లో గుండాల,లక్ష్మీగూడ,సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు 200 మంది స్థానిక ఎంపీటీసీ తిప్పని సుజాతశివారెడ్డి, యువనాయకుడు కాంతారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పట్లొళ్ల కార్తీక్‌ రెడ్డి,ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి ఎన్నికల ఇన్‌చార్జి పట్లొళ్ల కార్తీక్‌ రెడ్డి,ఎమ్మెల్యే కాలె యాదయ్య గులాబీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు,బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రజలు గమనించి ఓటు వేయాలని అన్నారు.సీఎం కేసీఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ప్రజలకు వివరించి పార్టీ పటిష్టత, గెలుపునకుకృషిచేయాలన్నారు .వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలపించి కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎం చేయాలన్నారు.బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు కష్టపడి పార్టీ పని చేస్తే,బీఆర్‌ఎస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు.కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివప్రసాద్‌,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్‌ నర్సింలు,మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల  ప్రభాకర్, సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి,బీఆర్‌ఎస్ మండల బీసీసెల్‌ అధ్యక్షుడు ఎదిరె రాములు,సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శివనీలచింటు,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు రామాగౌడ్‌,మార్కెట్‌ కమిటీ మాజీ వైస్ చైర్మన్‌ మాసన్నగారి మాణిక్యరెడ్డి,రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్‌ గౌడ్‌, హన్మంత్‌ రెడ్డి,సర్పంచ్‌లు శేరి స్వర్ణలతాదర్శన్‌,సామ మాణిక్యరెడ్డి,భీమయ్య,లావణ్యశంకర్‌,జహంగీర్‌, అనూషసత్తయ్య గౌడ్‌,మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఫయాస్,బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ఘని,బీఆర్‌ఎస్ మండల యూత్‌ అధ్యక్షుడు శేఖర్‌,సివిల్‌ సప్లయ్‌ జిల్లా సభ్యుడు దండు రవీందర్‌,బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జైపాల్‌ రెడ్డి, బీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మద్దెల జంగయ్య,పెంటారెడ్డి,వంగ శ్రీధర్‌ రెడ్డి,శేరి రాజు,సాయినాథ్‌,రాంరెడ్డి,ఎల్లన్న,నర్సింలు,దండు సత్యం,బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page