బీజేపీ, కాంగ్రెస్ కు వోటు వేసి గోసపడొద్దు

నమ్మకానికి మారు పేరు మన కేసీఆర్
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారు
కారు గుర్తుకు వోటు గుద్దుర్రి.. తరువాత సన్న బియ్యం పట్టుర్రి
బండారి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించండి
వైద్య,ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 8: కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించారనీ, 30న కారుకు ఓటు గుద్దుర్రి….. తరువాత సన్న బియ్యం పట్టుర్రి అని వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ వియన్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ఉప్పల్ నియోజక ఎమ్మేల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి కి మద్దతుగా మహిళా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అక్కా చెల్లెళ్లు కొంత ఆలోచన చేయాలి. కేసీఆర్ వచ్చాక ఏంచేశారు…కాంగ్రెస్ ఏం చేసిందోనని బాగా ఆలోచన చేయాలన్నారు. పొద్దున లేస్తే మంచి నీళ్లకు ఇబ్బందులు ఎలా ఉండెనో గుర్తు చేసుకోవాలనీ.. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చారని పేర్కొన్నారు. మనం ఇచ్చే మిషన్ భగీరథ పథకంను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కొనియాడిందన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాఫీ కూడా కొట్టి హర్ ఘర్ కా జల్ అని పథకం పెట్టారనీ విమర్శించారు. అప్పట్లో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని ప్రజలు అనేవాళ్ళు….కానీ ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖానకు అని ప్రజలు పరుగులు పెడుతున్నారు. మీ బస్తీలొనే మీ సుస్థిని బస్తీ దవాఖానలో నయం చేశామని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ మంజూరు చేశామని, ఇప్పటికే ఇక్కడ అనేక బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని లక్ష్మా రెడ్డిని గెలిపిస్తే మరిన్ని బస్తీదవాఖానలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నేడు వైద్య రంగం లో చాలా మార్పు వచ్చిందనీ.. కడుపులో బిడ్డ పడ్డప్పుడు నుండి బిడ్డ పెళ్లి అయ్యే వరకు మన ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నా రు. పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చారనీ, ఆడబిడ్డకు అండగా మన కేసీఆర్ నిలిచారనీ తెలిపారు.
ఆడబిడ్డకు మేనమామ లాగా కల్యాణ లక్ష్మీ మొదట 50 వేలు, తరువాత75 వేలు, ప్రస్తుతం రూ.1లక్ష116 ఇస్తున్నారన్నారు. పిల్లల చదువు కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారనీ.. పిల్లల విదేశీ విద్య కోసం “విదేశీ విద్య” పథకం పెట్టారనీ, కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ లో ఒక్క పేకాట క్లబ్ లేదనీ.. అన్ని క్లోజ్ చేశారనీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఈ పేకాట క్లబ్ లు వస్తాయనీ అవి వస్తే మళ్ళీ మహిళల పుస్తెలు అమ్ముడేనని , అంటే కాంగ్రెస్ గెలుచుడు వద్దు…..ఈ పేకాట క్లబ్ ల గబ్బు వద్దు మనకు అని అన్నారు. మొదట పెన్షన్ 1000 రూపాయలు ఉండేదని, తరువాత రెండు వేలు చేశారనీ ఇప్పుడు 5 వేలు చేస్తాం అని ,
మాట తప్పని సిఎం కేసీఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం పెట్టిన మహిళల పేరుతోనే పెట్టారనీ, గృహ లక్ష్మీ, కల్యాణ లక్ష్మీ, ఇప్పుడు సౌభాగ్య లక్ష్మీ పెట్టారన్నారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు గుద్దుర్రి….. తరువాత సన్న బియ్యం పట్టుర్రి అన్నారు. గ్యాస్ సిలిండర్ 400 కె ఇస్తామన్నారు. చెప్పుడు మాటలు విని బీజేపీ, కాంగ్రెస్ ఓటు వేసి గోసపడద్దని, నమ్మకానికి మారు పేరు మన కేసీఆర్ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక కరువు లేదు….కర్ఫ్యూ లేదన్నారు. కర్ణాటక లో ఇవాళ కరెంట్ కటకటలు ….గ్యారెంటీ లు లేవు పాడు లేవు , రాజస్థాన్ లో ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు ఎందుకన్నారు. తెలంగాణ లో షి టీం లు పెట్టి ఇక్కడ ప్రతి మహిళకు రక్షణ కల్పించారన్నారు. ప్రతి కుటుంబానికి ఈ 5 లక్షల ఆర్ధిక భరోసా, రైతు భీమాతో , కేసీఆర్ భీమా తో ప్రతి కుటుంబానికి ఆసరా అవుతుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించాలని.. ప్రజల మనిషి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు.
ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ… మహిళా సమ్మేళానానికి వచ్చిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 10 సంవత్సరాలలో ఉప్పల్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందనీ.. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, బీడీ కార్మికులకు పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. మహిళలకు మా ట్రస్ట్ ద్వారా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కేసీఆర్ భరోసా తో రేషన్ కార్డు దారునికి సన్న బియ్యం, కేసీఆర్ భరోసాతో ప్రతి ఇంటికి భీమా, పెన్షన్ పెంపు, గ్యాస్ 400 లకు ఇస్తున్నారనీ తెలిపారు. మీరందరూ కారు గుర్తుకు వోటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో ఉప్పల్ నియోజకవర్గంలో మహిళల పాత్ర కీలక మన్నారు. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాటి మంత్రులను నిలదీశామని గుర్తు చేశారు. కారు గుర్తుకు వోటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన ప్రభుత్వం సహకారంతో ఉప్పల్ స్కైవే ఏర్పాటు చేసుకున్నామనీ సుభాష్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీ పుర్ రాజు , ఎన్నికల ఇంచార్జీ రావుల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, పలువురు బిఅర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పార్టీ మహిళా కార్యకర్తలు దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page