ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి, మెదక్ పల్లి, రాంపూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అబివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న లేకున్నా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నానన్నారు. ఒకే ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని అన్నారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అబివృద్ధి ఎంటో చూపిస్తాను నేను సేవకుడిగా పని చేస్తాను మీ ఓటుతో అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో మీ గొంతు అవుతానని అన్నారు.