మధన్నే మా ఎమ్మెల్యే అని అంటున్న ప్రజలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ చేపట్టిన పాదయాత్ర ముచ్చటగా మూడో రోజుకు చేరుకుంది. అచ్చట, ఇచ్చట, ఎచ్చటైనా ఒకటే ముచ్చట. మధన్నే మా ఎమ్మెల్యే అని ప్రజలు అంటున్నారు. మంగళవారం మధు యాష్కి గౌడ్ పాదయాత్ర ప్రారంభంలో అమరుడైన శ్రీకాంత్ చారి, ప్రొఫెసర్ జయశంకర్, మహాత్మ జ్యోతిబాపూలే  పూలమాలవేసి విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం సెంట్రల్ బ్యాంక్ కాలనీ నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల బతుకులు మారాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనకు చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డుకు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ జెక్కిడి ప్రభాకర్ రెడ్డి, సేవదల్ ప్రెసిడెంట్ జితేందర్, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page