మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ …: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు
వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కి, క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి తరఫున జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ లు అందరికీ ఈరోజు ఒక చారిత్రిక సందర్భం ..అని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరిగా దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత మళ్ళీ జర్నలిస్టుల గృహ వసతి గురించి ఆలోచించిన ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల జర్నలిస్టులు జగన్ మోహన్ రెడ్డి ని కలిసి తమ సమస్యలను విన్నవించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎన్నికల ప్రణాళిక లో పొందుపరిచిన హామీ ని ఇవాళ నెరవేర్చారు అని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.