మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 3: బీజేపీ అధికారంలోకి రాగానే పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానంతో పాటు తగిన ప్రాముఖ్యత ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీ రాములు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్ కు చెందిన మాజీ కౌన్సిలర్ డాక్యా నాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి అధ్వర్యంలో అందెల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి అందెల పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా అందెల శ్రీ రాములు మాట్లాడుతూ.. బీజేపీతోనే ఉచిత విద్యా, వైద్యం లభిస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది సాధించడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపర్చుటకు బీజేపీకి ఓటు వేయాలని కోరారు.ఆర్కేపురం పార్టీ మాజీ కౌన్సిలర్ డాక్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షకృ నాయక్, బంజారాబస్తీకి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్ నాయక్, రతన్ నాయక్, గోవింద్ నాయక్, హరి నాయక్ తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ… బీజేపీ పార్టీ గెలుపునకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధీరజ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముంతా రాములు, సుదర్శన్, వెంకటరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.