తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 3 : బీఆర్ఎస్ పార్టీకి చెందిన పట్టణ మహిళ ప్రధాన కార్యదర్శి గాజుల మాధవి. ఆమె భర్త హనుమాన్ దేవాలయ చైర్మన్ గాజుల కమలాకర్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు . ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ అరాచక పాలనకు కాలం చెల్లిందని రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, సాయిపూర్ బాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, మసూద్, స్పోక్ పర్సన్ కల్వ సుజాత, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి, మాధవి, పట్టణ . అధ్యక్షులు హబీబ్ లాల, , తదితరులు పాల్గొన్నారు.