ఆమనగల్లు లో బిజెపి అభ్యర్థి ఆచారికి మద్దతుగా ప్రచారం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 2 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి కి మద్దతుగా మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించార జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఉద్యమాల ముద్దుబిడ్డ ఆచారిని ఆశీర్వదించాలని కోరారు.  ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. 40 ఏళ్లుగా బీజేపీ పార్టీలోనే ఉంటూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్న ఆచారిని ఆశీర్వదించాలని కోరారు. పట్టణంలోని కూరగాయలు, పండ్ల, చిరు వ్యాపారులను కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆచారి కి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో  పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, నాయకులు గోరేటి నరసింహ, చెన్నకేశవులు, కండే సాయి, హరినాథ్, గోరేటి యాదగిరి, మల్లేశ్ బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page