సుప్రీమ్ కోర్టులో నేడు వనమా కేసు
విచారణ జరపనున్న త్రి సభ్య ధర్మాసం
వనమా రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు
కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబం సంచనలాకు వేదికగా నిలుస్తూ దేశవ్యాత్తంగా వార్తల్లో నిలుస్తుంది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు కేసుపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరుగనుంది. ఈ పిటిషన్ విచారణ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ త్రి సభ్య ధర్మాసనం ముందుకు రానున్నది. ఈ నేపధ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఇద్దరు కలిసినా వనమా కేసు గురించే చర్చించుకుంటున్నారు. సుప్రీమ్ కోర్టు తీర్పుతో వనమా రాజకీయ భవితవ్యం తేలనుండటంతో నియోజకవర్గంలో సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే దురదృష్ట వంతుడిని ఎవడూ బాగు చేయలేడు, అదృష్ట వంతుడిని ఎవరూ చెడగొట్ట లేరు అన్నట్లుగా ఎన్ని వివాదాలు చుట్టు ముట్టినా, ఎందరు వద్దని వారించినా గులాబీ బాస్ కెసిఆర్ మాత్రం ఆ పెద్దాయనకే ఓటు వేసి అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తున్నారు. అదృష్ట కవచంలాంటి కేసిఆర్ నమ్మకం వనమాకు అండగా నిలుస్తోంది. కేసులు, వివాదాలు మనమా కుటుంబాన్ని వెంటారుడుతూ ఉక్కిరి, బిక్కిరి చేస్తున్నా సిఎం కెసిఆర్ మొదటి జాబితాలోనే మనమాకు సీటు కేటాయించి అనుమానాలకు తెర దిపంపాడు. 2018 ఎన్నికల సేసులో హైకోర్టు తీర్పు చాలదన్నట్లుగా ఆయన తనయుడు రాఘవ ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విమర్శలు వెల్లు వెత్తున్న సమయంలో వనమాకు టికెట్ కష్టమే అనుకుంటున్న తరుణంలో కెసిఆర్ వనమాకు బిఫారమ్ ఇచ్చి అందరూ ముక్కున వేళు వేసుకునేలా చేశారు.
ప్రత్యర్థే అభ్యర్థి అవుతాడా ?
సుప్రీమ్ కోర్టులో ఇప్పటికే కేసు దాఖలై సుమారు మూడు నేలలుగా సాగుతోంది. దీనితో తీర్పు వెలువడే అవకాశాలను కొట్టి పారేయలేమనే ఆలోచనలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఒక వేళ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు తీర్పును ధర్మాసనం సమర్థిస్తే కొత్తగూడెం అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ ? అంటూ కారు నేతలను కంగారుకు గురిచేస్తుంది. అయితే జగలం స్వతంత్ర అభ్యర్థిగా కొత్తగూడెం బరిలో నిలుస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తీర్పు వనమాకు వ్యతిరేకంగా వస్తే వనమా రాజకీయ భవిషత్కు తెరపడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.వనమా పై కేసు వేసిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు తిరిగి అధికార పార్టీ నుండి పోటీలో నిలుస్తాడా ? అన్నది నియోజకవర్గ ప్రజల మధిని తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదే నిజమైతే ప్రత్యర్థే అభ్యర్థిగా మారిన అరుధైన ఘటనకు కొత్తగూడెం నియోజకవర్గం వేధికగా మారనుంది.