దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

ఎల్బీనగర్‌ ‌బూత్‌ ‌కమిటీ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌

ఎల్‌.‌బి.నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:  ‌రాష్ట్ర ప్రభుత్వం  అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్‌ ‌పరిధిలోని జీ.ఎస్‌.ఆర్‌.‌గార్డెన్స్ ‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బూత్‌ ‌కమిటీ కో ఆర్డినేటర్లు,  బూత్‌ ‌కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఎల్‌.‌బి.నగర్‌ ‌శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌  ‌హాజరై మాట్లాడారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..  క్షేత్రస్థాయిలో బూత్‌ ‌కమిటీల బాధ్యత కీలక మన్నారు.  వచ్చే ఎన్నికల్లో బూత్‌ ‌కమిటీ కో ఆర్డినేటర్లు,  బూత్‌ ‌కమిటీ సభ్యులు కీలకం గా వ్యవహరించాలని సూచించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలన్నారు.  బిఆర్‌ఎస్‌ ‌పార్టీ మేనిఫెస్టోను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని  కోరాలని సూచించారు.  ప్రతి ఒక్కరు ఆప్యాయంగా ఓటర్లను పలకరించి చైతన్యపరిచి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కారు గుర్తుకు ఓటేసి సుధీర్‌ ‌రెడ్డి  గెలుపుకై 30 రోజులు కష్టపడితే.. ఐదు సంవత్సరాలు ఎల్‌.‌బి.నగర్‌ ‌నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామన్నారు.

ఎల్‌.‌బి.నగర్‌ ‌నియోజకవర్గంలో ఎమ్మెల్యే  సుధీర్‌ ‌రెడ్డి  సమక్షంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఓటర్లకు ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని, రాష్ట్రంలోనే నెంబర్‌ ‌వన్‌ ‌మెజారిటీ తీసుకువచ్చే విధంగా కంకణ బద్ధులై బూత్‌ ‌కమిటీ సభ్యులందరూ పనిచేయాలని మంత్రి వారికి దిశా నిర్దేశం చేశారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారం రావడం కేసీఆర్‌  ‌ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎల్బీనగర్‌ ‌లో కారు గుర్తుకు ఓటేసి తన గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం,మాజీ కార్పొరేటర్లు గజ్జల సుష్మ మధుసూదన్‌ ‌రెడ్డి,ముద్రబోయిన శ్రీనివాసరావు,కొప్పుల విఠల్‌ ‌రెడ్డి,సామ తిరుమల రెడ్డి,జిట్టా రాజశేఖర్‌ ‌రెడ్డి,జిన్నారం విఠల్‌ ‌రెడ్డి,పద్మ శ్రీనివాస్‌ ‌నాయక్‌,‌సంగీత ప్రశాంత్‌ ‌గౌడ్‌,‌సాగర్‌ ‌రెడ్డి,భవాని ప్రవీణ్‌ ‌కుమార్‌,‌కర్మన్‌ ‌ఘాట్‌ ‌హనుమాన్‌ ‌దేవాలయం చైర్మన్‌ ‌నల్ల.

రఘుమరెడ్డి,జయచంద్ర రెడ్డి చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌చైర్‌ ‌పర్సన్‌  ‌కమల సుధీర్‌ ‌రెడ్డి,పలు డివిజన్ల అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి,కటికరెడ్డి అరవింద్‌ ‌రెడ్డి,చింతల రవి కుమార్‌,‌చెన్నగొని శ్రీధర్‌ ‌గౌడ్‌,‌శ్రీశైలం యాదవ్‌,‌సత్యంచారి,లింగాల రాహుల్‌ ‌గౌడ్‌,‌తోట మహేష్‌ ‌యాదవ్‌,‌రాజిరెడ్డి,చిరంజీవి,వరప్రసాద్‌ ‌రెడ్డి,మహిళా అధ్యక్షురాళ్లు కోసనం ధనలక్ష్మి,రోజారెడ్డి,ఆదిలక్ష్మి,లత,లక్ష్మీ ప్రసన్న,శ్వేతా రెడ్డి,అంజలి,మల్లిక,ప్రమీల,సువర్ణ రెడ్డి,నాగలక్ష్మి మరియు సీనియర్‌ ‌నాయకులు ఈశ్వరమ్మ యాదవ్‌,ఆనంతుల రాజిరెడ్డి,బిచేనేపల్లి వెంకటేశ్వరరావు,కాచం సత్యనారాయణ,కుంట్లూరు వెంకటేష్‌ ‌గౌడ్‌,ఓరుగంటి వెంకటేష్‌,‌గడ్డం మల్లేష్‌ ‌గౌడ్‌,‌నర్సింహాగుప్తా  పలు విభాగాల ధర్మకర్తలు,సీనియర్‌ ‌నాయకులు,ఉద్యమకారులు,మాజీ మార్కెట్‌ ‌కమిటీ సభ్యులు,డివిజన్‌ అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాళ్లు,మాజీ అధ్యక్షులు,పలు విభాగాల కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page