– రైతులపై కాంగ్రెస్ పగబట్టింది
-వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం
– పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టో
మహిళల కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలు ప్రవేశపెట్టారని మహిళలు బిఆర్‌ఎస్ పార్టీ వైపే ఉన్నారనే సంగతి ప్రతిపక్షాలకు తెలవదని ఆయన విమర్శించారు. రైతుబంధు కింద 72 కోట్లు ఇచ్చామని కేసిఆర్ కు పనితనం తప్ప పగతనం లేదని మంత్రి తెలిపారు.మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రాగానే మహిళల కోసం నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సౌభాగ్య లక్ష్మి తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు,కార్యకర్తలకు సూచించారు.కేసీఆర్ అంటేనే ఒక నమ్మకం అని ఆయన పేర్కొన్నారు.రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండగల మార్చామని ఆయన తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో బిజెపి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పారిపోయారని ఆయన ఎద్దేవ చేశారు.రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏమి చేయలేరని వారిని నిండుగా ముంచేందుకే పథకాలు రక్షిస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించారు.
కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని దేశంలో ఎక్కడలేని విధంగా పథకాలను ఆచరిస్తాదని దేశం అనుసరిస్తదని మంత్రి తెలిపారు.40 లక్షల కుటుంబాలకు రైతుబంధు వర్తిస్తుందని ఆయన తెలియజేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన అభివర్ణించారు.రేషన్ కార్డు లబ్ధిదారులకు ఐదు లక్షల బీమా అందజేయడం జరుగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. కోటి కుటుంబాలకు కేసిఆర్ భీమాగా,ధీమాగా మారారని ఆయన అన్నారు.కేసీఆర్ అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ అంటే నాటకం అని ఆయన అన్నారు.కాంగ్రెస్ అంటే మాటలు,ముటాలు, మూటలు ఏర్పర్చుకొనే విధంగా ఉంటారని ఆయన ఎద్దేవ చేశారు.కాంగ్రెస్కు పదవులు తప్ప పనితనం తెలియదని ఆయన ఘాటుగా విమర్శించారు.ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ను అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులు కేసిఆర్ కు పోటీయా అని పరోక్షంగా విమర్శించారు.గరిష్ట పరిమితి 15 లక్షలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 2004 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అప్డేట్ చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వ భూములు ఉన్నవారికి న్యాయం చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో ఎకరానికి 15000 రూపాయలు రైతుబంధు పథకాన్ని పెంచుతామని ఆయన తెలిపారు.కోటి కుటుంబాలకు కేసిఆర్ ధీమా పథకాన్ని కూడా ప్రవేశపెడతామని మంత్రి పేర్కొన్నారు.స్వయం సహాయక మహిళా సంఘాలకు భవనాలు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు నేడు నిస్సాయ స్థితిలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.కర్ణాటక రాష్ట్రంలో ఐదు గంటల మేరకే ఉచిత అందిస్తున్నారని అది కూడా సరిగా రావడం లేదని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు.అనాధ పిల్లల కోసం ప్రత్యేక పాలసీని తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.