పటాన్ చెరు, ప్రజాతంత్ర,అక్టోబర్ 27: దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించాల్సిన గురతర బాధ్యత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉందని, ప్రతి కార్యకర్త రాబోయే 30 రోజులు సైనికులవని పనిచేసే పార్టీ విజయానికి కృషి చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన రైతుబంధు, రైతు బీమా పథకాలను ఆపివేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయి నుండి తిప్పి కొట్టాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రతిపక్ష పార్టీల నిజస్వరూపాలను రైతులకు తెలియజేయాలని కోరారు. దశాబ్ది కాలంలో సాధించిన ప్రగతిని గడపగడపకు వివరించాలని కోరారు.ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లా రెడ్డి, వార్డు అధ్యక్షులు లక్ష్మణ్, ప్రభు, అడ్వకేట్ రమేశ్, మాజీ ఉప సర్పంచులు రాంమూర్తి, ప్రభు, విఠల్, మహేష్, శేరి మల్లా రెడ్డి, నర్సింలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.