కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతు విరోధి

  • ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువైంది
  • ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు
  • ఇంటింటికీ మంచినీళ్లు నిలిపేయాలని ఫిర్యాదు చేస్తారేమో!!
  • 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో?
  • కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర.అక్టోబర్‌26: ‌మంత్రి కే తారక రామారావు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదంటూ పేర్కొన్నారు. ‘రైతుబంధు’ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ‌ఫిర్యాదు చేయడంపై సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ‌ద్వారా విమర్శలు గుప్పించారు. ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా? అన్నదాత పాలిట నంబర్‌ ‌వన్‌ ‌విలన్‌ ‌కాంగ్రెస్‌ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కాంగ్రెస్‌ ‌కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించరు అంటూ కేటీఆర్‌ ‌కామెంట్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ అం‌టేనే.. రైతు విరోధి .. అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్‌ ‌వన్‌ ‌విలన్‌.. ‌కాంగ్రెస్‌ అని ఇంకోసారి తేలిపోయింది.. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్‌ ‌తోకలు కట్‌ ‌చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్‌ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారు.

రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.. అంటూ మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్లర్‌ ‌లో రాశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుబంధు అపాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి, రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఇప్పటికే కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని కేవలం అక్కసుతో ఆపేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే 11సార్లు పంట సీజన్లకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్‌ ఎన్నికల కోడ్‌ ‌పేరు చెప్పి రైతులకు సహాయం ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇలా కోడ్‌ ‌పేరుచెప్పి ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటును కూడా ఆపెయ్యమంటరా..? అని ప్రశ్నించారు.

మరీ అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? దీంతో అన్ని పథకాలను కాంగ్రెస్‌ ఆపాలంటుందా..? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అం‌టేనే%••% రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని, అన్నదాతల పాలిట నంబర్‌ ‌వన్‌ ‌విలన్‌ ‌కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్‌ ‌పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని హెచ్చరించారు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్‌ ‌కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరన్నారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్‌ ‌తోకలను ప్రజలు కట్‌ ‌చేయడం పక్కా అన్నారు కేటీఆర్‌. ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి.. కర్ణాటక రైతులను కాంగ్రెస్‌ ‌పార్టీ అరిగోస పెడుతుందని కేటీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్‌ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారన్నారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసేలా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్‌ ‌హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page