తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బబ్బర్ షేర్ తెలంగాణ అని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం జగిత్యాల పర్యటనలో భాగంగా కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ..‘సింహాలు సింగిల్గానే కాదు..గుంపులుగా కూడా వొస్తాయ్’ అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ సింహాలు గర్జిస్తున్నాయ్..రాబోయేది బబ్బర్ షేర్ తెలంగాణా అన్నారు. ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణాలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే, నాలుగు నెలల్లోనే ఓబీసీ కులగణన చేపట్టి.. వాళ్లకు రావల్సిన వాటా వాళ్లకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్లపై రాహుల్ ఫైరయ్యారు. వరి పంటకు 15వేల మద్దతు ధర కల్పించడంతో పాటు వారికి అదనంగా 500 ఎంఎస్పి అందజేస్తామని రైతులకు రాహుల్ గాంధీ భరోసానిచ్చారు. జిల్లాలోని ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీని కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన వెంటనే తెరిపిస్తామని హామీ ఇచ్చారు.