అభివృద్ధికి ప్రతీక అమీన్ పూర్
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కె ఎస్ ఆర్ కాలనీలో ఇంటింటి ప్రచారం..
ఘన స్వాగతం పలికిన కాలనీ ప్రజలు..
పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: అమీన్ పూర్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధికి తార్కానంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న సమన్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ అమీర్ పూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా రూపొందించడం జరిగిందని తెలిపారు.మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని లక్ష్యంతో మూడు బస్తీధవకానాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సైతం మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో బిందెడు నీటి కోసం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితుల నుండి ప్రతిరోజు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్న ఘనత కేవలం బిఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.మున్సిపల్ పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గత నాలుగు సంవత్సరాల కాలంలో పది మిలియన్ లీటర్ల సామర్థ్యం తో ఐదు భారీ రిజర్వాయర్లు నిర్మించి, మెరుగైన మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు.కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం బీరంగూడ గోశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.విగ్రహ ప్రతిష్టాపనలో.
..అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శివాలయం, హనుమాన్, వినాయక దేవాలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్టాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు ఘన స్వాగతం పలికి ఆత్మీయ సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.