పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శిగా కేతావత్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు విజయ రాజు శ్రీనివాస్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించినటువంటి బాధ్యతను పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.