ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 17 : ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సమక్షంలో బిజెపి, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వగృహంలో మాడ్గుల మండలంలోని నాగిల్ల గ్రామానికి చెందిన 70 మంది నాయకులు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి చేరడంతో వారందరికీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ జగ్పాల్ రెడ్డి, నారాయణ గౌడ్, నిరంజన్ గౌడ్ పాల్గొన్నారు.