కేసీఆర్ కుటుంబం అవినీతి దిల్లీ వరకు పాకింది

 

యువత పోరాటం ద్వారానే రాష్ట్రం

-రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపణ

మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీ వరకు పాకిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం ఇంఛార్జి అందెల శ్రీ రాములు నేతృత్వంలో బిఏంసి బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి అద్యక్షతన నిర్వహించిన జన గర్జన భారీ బహిరంగ సభకు రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇంఛార్జి జవదేకర్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంట్ బోర్డు మెంబర్ డాక్టర్ డాక్టర్ లక్ష్మణ్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చి, రాష్ట్ర అభ్యున్నతికి పటుపడినట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన అభివృద్ధి తప్ప, కేసీఆర్ చేసింది ఏమి లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి ఏమో గానీ, కేసీఆర్ కుటుంబం మాత్రం అభివృద్ధి చెందిందన్నారు.

అవినీతిలో కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీకి కూడా పకిందన్నారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్, బిఆర్ఎస్ చేసింది ఏమి లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం మోడీ మహిళల సాధికారత కొరకు మహిళా బిల్లు తీసుకు వచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా స్కాంలతో కూడుకున్నదని ఆరోపించారు. మోడీ దానిని పూర్తిగా నిర్మూలించి, నేరుగా ప్రతి పైసా ప్రజలకు చేరేవిదంగా ఒక చక్కటి వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణ సాధించడంలో కెసిఆర్ పాత్ర ఏమాత్రం లేదని, కేవలం తెలంగాణ యువత పోరాటం ద్వారానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో బిజెపి పాత్ర విస్మరించలేనిదని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణలో ప్రజల జీతాలు ఏమాత్రం బాగుపడకేదని, కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడినదని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపితో సాధ్యమన్నారు. మోడీ నాయకత్వంలో రక్షణ శాఖతో పాటు అన్ని రంగాలు పట్టిష్టంగా ఏర్పాటు జరిగాయన్నారు. మోడీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచం నేడు కొనియాడుతుందని, ఒకప్పుడు భారతదేశం ఇతర దేశాల వైపు చూసేదని, కానీ అదే నేడు మోడీ నాయకత్వంలో ప్రపంచం భారత వైపు చూస్తున్నాయని చెప్పారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఉద్యోగాలు రకా అనేక మంది యువతి, యువకులు ఆత్మ హత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత ప్రభుత్వం కావాలంటే బీజేపీకి ఓటు వేసి, గెలిపించాలని పిలుపు ఇచ్చా

రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page