సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఒకరోజు వర్క్ షాప్ రిటైర్డ్ ఐజిపి ఆనంద్ వర్ధన్ శుక్ల, ఐపీఎస్ ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఐజిపి ఆనంద్ వర్ధన్ శుక్ల, మాట్లాడుతూ….ప్రతి పోలీస్ అధికారికి ప్రజల సమస్యలు సామరస్యంగా ఓర్పు సహనంతో వినడం బాధ్యతగా వివరించడం సమస్యను తీర్చడం చాలా ముఖ్యమని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలు మా పోలీసులు మాకు రక్షణ కల్పిస్తారు. బాధ్యతగా వ్యవహరిస్తారు అనే నమ్మకం చాలా ముఖ్యమన్నారు. పోలీసుల అంచనాల ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా సేవలందించాలన్నారు. ధనిక పేద అనే తేడా లేకుండా పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారున్ని సమానంగా చూడాలన్నారు. ప్రజా సేవకులమని గుర్తురికి విధులు నిర్వహించాలన్నారు. వాహనాల తనిఖీలలో నాకాబందీలలో పోలీసులు ప్రవర్తించవలసిన విధివిధానాల గురించి వివరించారు. సాఫ్ట్ స్కిల్ శిక్షణ అనేది సామాజికంగా వృత్తిపరంగా ముఖ్యమైన వ్యక్తిగత లక్షణాలు కమ్యూనికేషన్ సామర్థ్యాలు మొదలైన వాటిపై బాగా ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఒక వ్యక్తి ఒక వ్యవస్థ విజయం ఎదుగుదల లో సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు.సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ లో టీం వర్క్ చాలా ముఖ్యమని ఏదైనా సమస్య ఉంటే అందరూ కలిసి చర్చించుకోవాలన్నారు.1. స్పిరిట్యువల్ రిలాక్సేషన్, 2. ఫిజికల్ రిలాక్సేషన్, 3. ఎమోషనల్ రిలాక్సేషన్, 4. మెంటల్ రిలాక్సేషన్, ఒక పద్ధతి ప్రకారం ప్లానింగ్ చేయ్యడం, కోపం ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవడం టైమ్ మేనేజిమెంట్ వంటి చర్యలు కూడా ఒత్తిడిని మేనేజ్ చేయవచ్చు ఒత్తిడిని జయించాలంటే పెద్ద పెద్ద ప్రణాళికలు అవసరం లేదు ప్లానింగ్ మార్చుకుంటే చాలు దానిని బట్టి మైండ్ సెట్ మార్చుకోవచ్చు అని,నేటి ఆధునిక సమాజంలో మనిషి అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడని, అనవసరంగా పరుగులు పెడుతున్నాడని అన్నారు. మనం వేరే ఇంకెవ్వరితోనూ పోల్చుకోవడం తగదని, మనలను మనమే మెరుగుపరచుకోవడంలోనే ఆనందం ఉన్నదనీ తెలిపారు. ఆధునిక పరిజ్ఞానం వలన శారీరక శ్రమ బాగా తగ్గిన నేపథ్యంలో ఆటపాటల ద్వారా ఉల్లాసంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవటం, మంచిదని తెలిపినారు.రోల్ ఆఫ్ లీడర్షిప్, టీం వర్క్, జెండర్ సెనిస్ట్యూటివ్ వర్క్, ప్రెస్ మేనేజ్మెంట్ వర్క్, పాజిటివ్ థింకింగ్, టైం మేనేజ్మెంట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్స్, హ్యూమన్ రైట్స్, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, లైఫ్ స్టైల్, కమ్యూనిటీ పోలీసింగ్, తదితర అంశాల గురించి క్లుప్తంగా అధికారులకు వివరించారు.వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్న పోలీసింగ్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, యస్ మల్లారెడ్డి, ఏసీపీలు సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, చంద్రశేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.