జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, ఆడబిడ్డలను గౌరవించుకోవడం బిఆర్ఎస్ ఆనవాయితీ అని, బతుకమ్మ పండుగ కానుకగా సర్కారు సారె అందించడంజరుగుతుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ గుప్త అన్నారు. చాట్లపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళలకు బతుకమ్మ పండుగకు కానుకగా చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మహిళలను గౌరవించుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ సంస్కృతి అని పేర్కొన్నారు. పూల పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షురాలు కావ్యదర్గయ్య, కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఏక్భాల్, ఉప సర్పంచ్ ఆజాం, నాయకులు ఖదీర్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.