వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: గిరిజన బాలికల వసతి గృహాన్ని వికారాబాద్ పట్టణంలో నిర్మాణం చేయాలని అఖిల భారతీయ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్ నాయక్. గిరిజన బాలికల కాలేజీ వసతిగృహము మంజూరు కావడం జరిగింది అట్టి కాలేజీ వసతి గృహము వికారాబాద్ పట్టణంలో బంజారా భవనం నిర్మించబడినటువంటి ప్రక్కన కాలేజీ వసతి గృహము రేపు అనగా ఐదో తారీకు తెలంగాణ మున్సిపల్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ వస్తున్నా సందర్భంగా వసతి గృహము నిర్మించడానికి శిలాఫలకము ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ప్రతి కాలేజీకి అక్కడి నుండి రావాలంటే 6 ,7 కిలోమీటర్లు ప్రయాణము చేయవలసి వస్తుంది అదేవిధంగా అమ్మాయిలకు సెక్యూరిటీ గాని లేదా ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం అవుతుంది వికారాబాద్ పట్టణంలో ఇంకిక్కడైనా 10 గుంటల జాగా ఇచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు అమ్మాయిలకు వసతి గృహం కట్టించి వారిని ఆదుకునే విధంగా ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుతున్నా ఒకవేళ గిరిజనుల మీద ప్రేమ ఉండి వారి వారికి వసతి గృహం ఏర్పాటు చేయాలనుకుంటే బాలుర కాలేజీ వసతి గృహంగా నిర్మించాలని కేటీఆర్ ను ఎమ్మెల్యే గారిని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. దయచేసి బాలికల వసతి గృహము ఏర్పాటు చేయాలనుకుంటే జిల్లా అధికారులు దయచేసి ఆలోచించాలని కోరుతున్నాం అన్నారు.