బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే

ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన
కేసీఆర్‌ ‌కుటుంబం అవినీతిపై ప్రధాని మౌనం ఎందుకు
తెలంగాణకు భరోసా ఇవ్వని ప్రధాని పర్యటన
మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్‌ ఎం‌పీ, టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మోదీ..దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్‌కు ప్రధాన మంత్రా? అని సందేహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌?‌రెడ్డి. విభజన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఏ భరోసా ఇవ్వలేదని..పార్లమెంట్‌ ‌సాక్షిగా ఇచ్చిన హమీలనే నెరవేర్చలేదని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించకుండా, పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం ప్రధాని అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు ఆపుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోదీని తెలంగాణకు తేవడం ప్రజలని అవమాన పరచడమే అని అన్నారు. మోదీ చేసిన మోసానికి డీకే అరుణ, కిషన్‌ ‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చునని, మోదీ సభకు పరోక్షంగా సహకరించిన కేసీఆర్‌ ‌కూడా దోషియేనని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు పక్రియనే మోదీ తప్పు పట్టారు. అలాంటి మోదీ సభను పాలమూరు జిల్లాలో నిర్వహించినందుకు డీకే అరుణ, జితేందర్‌ ‌రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రేవంత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. వారి భజన వారు చేసుకోవడానికే సభ పెట్టుకున్నారని విమర్శించారు.

మోదీ వచ్చి వరాలు ఇస్తాడని ఆశించామని..పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై మోదీ ప్రకటన చేస్తారని అనుకున్నామన్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు కొత్త అంశాలు కాదని తెలిపారు. అలాగే బీఆర్‌ఎస్‌ ‌మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌రావులపైనా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌ ‌రెడ్డి సోమవారంలో గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని..రాష్ట్రానికి రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మోదీ పర్యటనను కాంగ్రెస్‌ ‌తీవ్రంగా ఖండిస్తుందన్నారు రేవంత్‌ ‌రెడ్డి. మోదీ మహబూబ్‌ ‌నగర్‌ ‌పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తారని అనుకున్నామని, తెలంగాణకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటారని, ఐటీఐఆర్‌ ‌కారిడార్‌ను పునరుద్దరిస్తారని,  బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు విభజన హామీలను అమలు చేస్తారని ఆశించామని, కానీ వీటిలో ఏ అంశాలను ప్రధాని కనీసం ప్రస్తావించలేదని రేవంత్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ గతంలో ఇచ్చిన హామీలేనని అన్నారు.

మోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని, విభజన హామీలు అమలు చేయకపోవడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీతో సభ నిర్వహించడం అనైతికమన్నారు. కార్యక్రమానికి వివేక్‌, ‌కొండ విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రాజ్‌ ‌గోపాల్‌ ‌రెడ్డి అందుకే రాలేదనే చర్చ నడుస్తుందన్నారు. మోదీ పర్యటనకు అయినత ఖర్చు కూడా పాలమూరుకు ఇవ్వలేదని రేవంత్‌ ‌విమర్శించారు. కుటుంబ దోపిడీ గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. దీంతో..బీఆర్‌ఎస్‌-‌బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయిందని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ ‌కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని ప్రజలకు మోదీ ఎందుకు హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటనలన్నారు. కాంగ్రెస్‌ ‌బలంగా ఉన్నచోట వోట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, మోదీ పరోక్షంగా బీఆరెస్‌ను గెలిపించాలని చూస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ఇవి కాంగ్రెస్‌ను ఓడించేందుకు బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలిద్తరూ ఏకమై చేస్తున్న పర్యటనలని అన్నారు. ఇక కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు బిల్లా రంగాల్లా తిరుగుతున్నారని అన్నారు.

2004, 2009 కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టోతో తాను వొస్తానని, 2014, 2018 మ్యానిఫెస్టోలతో చర్చలకు వొస్తారా…అని ప్రశ్నిస్తూ రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌కు సవాల్‌ ‌విసిరారు రేవంత్‌రెడ్డి. 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్‌ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నా..ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కానీ, ఈ బిల్లా రంగాలు(కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావులను ఉద్దేశిస్తూ..) కాంగ్రెస్‌పై ఇష్టం వొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ ‌మెంట్‌, ‌మైనారిటీ రిజర్వేషన్‌ అమలు చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని, 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన ఆరు హామీలను  వైఎస్సార్‌ అమలు చేసి చూపించారని, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేసి చూపామని రేవంత్‌ అన్నారు. రాష్ట్రాల ఆదాయం, ప్రజల అవసరాలను బట్టి పథకాలు ఉంటాయని, కానీ, ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం విలువ తెలియదని, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు…ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని మాట్లాడుతున్నారని రేవంత్‌ ‌మండిపడ్డారు. గతంలో తమ పదేళ్ల పాలన.. వారి పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని తాను ఆ ఇద్దరికీ సూటిగా సవాల్‌ ‌విసురుతున్నానని రేవంత్‌ అన్నారు.

ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా వారిని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్‌లో బహునాయకత్వం ఉంటే తప్పేంటని, బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. అయినా తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌ ‌గడ్‌, ‌కర్ణాటకలో సీఎంలు మారారా? అని ప్రశ్నించారు. మాట ఇస్తే అమలు చేసే పార్టీ కాంగ్రెస్‌ అని, ఆనాడు అమలు చేశామని, ఇప్పుడూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామని, కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతికత బిల్లా రంగాలకు లేదన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను నమ్మదు.. క్షమించదన్నారు. కర్ణాటక ప్రభుత్వం వసూళ్లపై కేటీఆర్‌కి అనుమానం ఉంటే విచారణకి లెటర్‌ ‌రాస్తే దాన్ని ఆమోదించి విచారణ చేయించాలని తాను కర్ణాటక ప్రభుత్వానికి డిమాండ్‌ ‌చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వసూళ్లపై  విచారణ జరిపించాలని లెటర్‌ ‌రాస్తానని, ఆమోదించి విచారణ జరిపిస్తారా? అని నిలదీశారు రేవంత్‌. అలాగే..వోట్ల కోసమే కేటీఆర్‌ ‌స్వర్గీయ ఎన్టీఆర్‌ ‌పేరును వాడుకుంటున్నాడంటూ విమర్శించారు రేవంత్‌. ఎన్టీఆర్‌ ‌పేరుతో వోట్లు దండుకోవాలని బీఆరెస్‌ ‌చూస్తుందని, వారి దోపిడీకి ఎన్టీఆర్‌ ‌పేరును వాడుకుంటారా..అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ‌పేరుతో పోల్చుకునే అర్హత కేటీఆర్‌కు లేదని, ఎన్టీఆర్‌తో పోల్చుకునే అర్హత బీఆరెస్‌లో ఎవరికీ లేదని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page