ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆమనగల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్యలు కమిషనర్ శ్యాంసుందర్ తో కలిసి కార్మికులకు రక్షణ దుస్తులు సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని చేర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్ అన్నారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలకు ప్రశంసా పత్రాలను వైస్ చైర్మన్ బీమానపల్లి దుర్గయ్య మున్సిపల్ కమిషనర్ వి. శ్యాంసుందర్ పాలకవర్గ సభ్యులతో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్ అందించారు. మున్సిపల్ కార్మికులు పట్టణ అభివృద్ధి కోసం సకాలంలో స్పందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.