33 ‌మంది తెలంగాణ నేతన్నలకు కేంద్రం 30 లక్షల ఆర్థిక సహాయం

దేశ వ్యాప్తంగా.. 68 మంది ఖాతాల్లోకి
నిధులు విడుదల చేసిన కేంద్ర టెక్స్‌టైల్‌ ‌మంత్రిత్వ శాఖ
కేంద్ర నేతన్నల సంక్షేమ నిధి నుంచి నిధుల విడుదల
‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌పేరిట స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు భారీ ప్రచారం జరుగుతోందన్న కిషన్‌ ‌రెడ్డి

న్యూదిల్లీ.ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా 68 మందిని ఎంపిక చేసి.. వారి ఖాతాల్లోకి నిధులను రెండు విడతల్లో విడుదల చేసింది. ఇందులో భాగంగా.. తెలంగాణ నుంచి.. 2022-23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను హైదరాబాద్‌ ‌వీవర్‌ ‌సర్వీస్‌ ‌సెంటర్‌ ‌కింద ఉన్న 33 మంది అవార్డు పొందిన నేతన్నలకు కేంద్ర టెక్స్ ‌టైల్స్ ‌మంత్రిత్వ శాఖ రూ. 30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.

ఇందులో తెలంగాణ నుంచి 33 మంది అకౌంట్లలోకి..  ఒక్కొక్కరి అకౌంట్లోకి.. నెలకు రూ. 8వేల చొప్పున సంవత్సరం మొత్తానికి కలుపుకుని రూ.96వేలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమచేసింది. దేశవ్యాప్తంగా 68 మంది లబ్ధిదారుల అకౌంట్లలోకి రూ. 62లక్షల జమ చేయగా.. ఇందులో సింహభాగం.. రూ. 30 లక్షల..  తెలంగాణకు సంబంధించిన లబ్ధిదారుల అకౌంట్లలోకి జమయ్యాయి. ఈ విధంగా నేతన్నల సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా, అన్ని రకాల పండుగలకు, శుభకార్యాలకు స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌పేరిట స్వయానా ప్రధానమంత్రి  నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం నేతన్నల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page