భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం •ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
•శోభాయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: నగరంతో పాటు పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనం గురువారం జరుగనుంది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్‌తో పాటు పలు ప్రాంతాల చెరువల వద్ద ఏర్పాట్లు చేసారు. ఎలాంటి అవాం• ••నీయ ఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తులో నిమగ్నం అయ్యారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్, పోలీస్ కమిషనర్ ఆనంద్, జియా ఉద్దిన్, వాటర్ వర్కస్ డైరెక్టర్ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, వివిధ శాఖలకు చెందిన అధికారులలతో కలిసి చార్మినార్ వద్ద నుండి ప్రత్యేక బస్సులలో ఉస్మాన్ గంజ్, మోజం జాహీ మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ల దుగా మార్గ్ లో ఖైరతాబాద్ గణశుడిని నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.
శోభాయాత్ర సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైరతాబాద్ వినాయ కుడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి డియా తో మాట్లాడుతూ హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తుందని గుర్తు చేశారు. గణెళిష్ విగ్రహాల శోబాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అవసరమైన ప్రాంతాలలో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52 వేల విద్యుత్ లైట్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భక్తులకు త్రాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకేట్స్ సిద్దం చేశామని, ఇందుకోసం 122 స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 12 కిలోటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్ ల ఏర్పాటు తో పాటు అత్యవసర వైద్య సేవల కోసం 15 హాస్పిటల్స్ లలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3 వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందని, వీరు రౌండ్ ద క్లాక్ గా విధులు నిర్వహిస్తారని వివరించారు. విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం కలగకుండా 33 అదనపు ట్రాన్స్ పార్మర్ లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణెళిశుడి నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాలలో ఏర్పాట్లు చేయడం జరిగిందని, అదేవిధంగా 33 బేబీ పాండ్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ డియా లో వచ్చే అసత్యపు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో వాటర్ వర్కస్ ఓఆ దానకిశోర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే గణెళిష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఆధ్వర్యంలో 535 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
నిమజ్జన శోభాయాత్ర అంతటా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వివిధ మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణెళిశ నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ఎండీ తెలిపారు. ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన సహాయం కోసం ప్రయాణికులు బస్ స్టేషన్‌ను 9959226154 నంబర్‌లో, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.