‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు డ్రగ్స్ ‌వాడుతున్నట్లుతెలుస్తున్నది.

గ్రామీణ గరిష్ట డ్రగ్‌ ‌వినియోగదారుల్లో గోవాలో 78 శాతం, పంజాబ్‌లో 77.5 శాతం ఉండగా పట్టణ గరిష్ట వినియోగదారుల్లో మిజోరమ్‌లో 91 శాతం, మోఘాలయాలో 90.7 శాతం ఉన్నారు. మన దేశంలో 2.1 శాతం ఓపియమ్‌, ‌హెరాయిన్‌, ఓపినాయిడ్స్ ‌వినియోగదారులు ఉండగా, 2.8 శాతం కన్నాబిస్‌ (‌భంగ్‌, ‌గంజాయి, ఛరస్‌) ‌వినియోగదారులు, డ్రగ్స్ ‌దురలవాటుకు లోనైన 10 నుంచి 17 ఏండ్ల పిల్లలు 15.8 మిలియన్లు ఉన్నారు. హెరాయిన్‌ ‌వినియోగంలో యూపీ/ఢిల్లీ, ఓపినాయిడ్స్ ‌దుర్వినియోగంలో యూపీ/పంజాబ్‌/ ‌హర్యానా/ డిల్లీ/ఏపీ రాష్ట్రాలు ముందున్నాయి. గరిష్ట డ్రగ్‌ ‌యూజర్స్ ‌రాష్ట్రాలుగా నాగాలాండ్‌లో 6.5 శాతం, అరుణాచల్‌లో 5.7 శాతం, సిక్కిమ్‌లో 5.1 శాతం వినియోగదారులు ఉన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రభావం: మాదకద్రవ్యాల వినియోగంతో మెదడు, కేంద్ర నాడీ మండల వ్యవస్థలపైన ప్రభావం చూపుతూ, రోగనిరోధకశక్తిని దెబ్బ తీస్తుంది. మాదకద్రవ్యాలు, ఆల్కహాల్‌ ‌మత్తు పానీయాల వాడకంతో అనేక తీవ్ర దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. డ్రగ్స్ ‌దుర్వినియోగంతో సామాజిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గాయాలు, హింసాత్మక ధోరిణిలు బయట పడతాయి. డ్రగ్స్ ‌వాడకంతో అసురక్షిత లైంగిక సంబంధాలు, అకాల మరణాలు, వాహన ప్రమాదాలు, ఆత్మహత్యలు, భౌతికంగా ఇతరులపై ఆధారపడడం జరుగుతుంది. వీటితో పాటు వ్యాధి ప్రభలత, మానసిక అస్పష్టత, కాలేయ సమస్యలు, మెదడు సమస్యలు, స్ట్రోక్‌, ‌హెపటైటిస్‌, ఊపిరితిత్తుల సమస్యలు, హెచ్‌ఐవి/ఏయిడ్స్ ‌లాంటి ప్రమాదకర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. డ్రగ్‌ ‌మహమ్మారి ఆవహించినపుడు చదువుల పట్ల అశ్రద్ధ, మానవ సంబంధాల్లో కుదుపులు, సమాజ చిన్నచూపు, ఆర్థిక పేదరికం, అసంబద్ధ ప్రవర్తనలు లాంటి పరిణామాలు కూడా ఎదురవుతాయి.

డ్రగ్స్ ‌దుర్వినియోగంలో దక్షిణ భారతంలో తెలంగాణ నంబర్‌ ‌వన్‌:   ‌తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉండగా అందులో 29 లక్షల మంది మాదకద్రవ్యాలు లేదా డ్రగ్స్ ‌దురలవాటుకు బానిసలైనారని వివరాలు స్పష్టం చేస్తున్నాయి. డ్రగ్స్ ‌వాడే జనాల్లో 1.90 లక్షలు గంజాయి (కన్నాబిస్‌) ‌వాడే వారు, 5.47 లక్షల మంది ఓపియం డ్రగ్స్(‌హెరాయిన్‌, ‌కొడెయిన్‌ ‌లాంటివి), 16.63 లక్షల మంది సెడేటివ్స్(‌మత్తు కలిగించే మందులు) దుర్వినియోగ బాధితులు ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో డ్రగ్స్ ‌దురలవాటు తెలంగాణలోనే అత్యధికంగా ఉండగా రెండవ స్థానంలో 17 లక్షల ఏపీ వినియోగదారులు ఉండడం విచారకరంగా కనిపిస్తున్నది. హైదరాబాదు నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌వింగ్‌(‌హెచ్‌-ఎన్‌ఈడబ్ల్యూ) వివరాల ప్రకారం మహానగర పోలీసులు 2022లో 86 కేసుల్లో 932 మంది డ్రగ్స్ ‌దుర్వినియోగదారులపై కేసులు నమోదుకాగా, 2.3 కోట్ల విలువైన డ్రగ్స్ ‌పట్టుకున్నారు. 2022లో తెలంగాణవ్యాప్తంగా 1,176 డ్రగ్‌ ‌కేసులు నమోదుకాగా వీటిలో 1,104 గంజాయి కేసులు, 72 సింథెటిక్‌ ‌డ్రగ్‌ ‌కేసులు నమోదు అవగా, వీటిలో 2,582 మంది డ్రగ్‌ ‌వినియోగదారులు అరెస్ట్ అయ్యారు. 2019 వివరాల ప్రకారం తెలంగాణలో 64,000 మంది సూది ద్వారా డ్రగ్స్ ‌వాడితే, ఢిల్లీలో 86,909 మంది, బెంగుళూరులో 44,530 మంది, మహారాష్ట్రంలో 44,323 మంది ఇంజెక్టబుల్‌ ‌డ్రగ్స్ ‌వాడే వారు గుర్తించబడ్డారు.

డ్రగ్స్ అ‌క్రమ రవాణా/వినియోగ శృంఖల వ్యవస్థ:  మాదకద్రవ్యాల వినియోగదారుల్లో 12 – 13 ఏండ్ల పిల్లల నుండి మొదలైన యువత అధికంగా ఉండడం గమనించారు. డ్రగ్స్‌కు బానిసలైన యువతను గుర్తించి పునరావాస కేంద్రాలకు (రిహబిలిటేషన్‌ ‌సెంటర్లు) పంపించడం, వారిని సామాన్య జనజీవితంలోకి చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా లాంటి రాష్ట్రాల నుంచి అధికంగా గంజాయి, కన్నాబిస్‌ ‌వర్గ మాదకద్రవ్యాలు హైదరాబాదుకు చేరుతున్నాయి. కొకెయిన్‌, ‌హెరాయిన్‌, ‌సంశ్లేషిత డ్రగ్స్ ‌నగరానికి అక్రమ మార్గాల గుండా కర్నాటక, గోవా ప్రాంతాల నుండి ప్రవేశిస్తున్నాయి. ఓపియమ్‌ ‌డ్రగ్స్ ‌మాత్రం రాజస్థాన్‌, ఏం‌పీ రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. మాదకద్రవ్యా అక్రమ రవాణా వ్యవస్థల్లో విదేశీ/స్థానిక పెడ్లర్స్, అం‌తర్‌రాష్ట్ర గ్యాంగులు, అంతర్జాతీయ స్మగ్లర్స్, ‌ట్రాన్స్‌పోర్టర్స్, ‌వినియోగదారులు లాంటి పకడ్బందీ శృంఖల డ్రగ్‌ ‌వ్యవస్థలు చీకటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు.

పక్కా ప్రణాళికతో డ్రగ్స్ ‌వ్యాప్తి నియంత్రణ: హైదరాబాదులో డ్రగ్‌ ‌విష సంస్కృతిని కట్టడి చేయడానికి హైద్రాబాదు నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌వింగ్‌, ‌నార్కొటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌సూపర్‌విజన్‌ ‌వింగ్‌, ‌తెలంగాణ స్టేట్‌ ‌నార్కొటిక్‌ ‌బ్యూరో సమర్థవంత సమన్వయంతో గత రెండేళ్లుగా పటిష్ట వ్యవస్థలు పనినచేస్తున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగ విషవలయంలో లోఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియెట్‌ ‌కళాశాలలు, ఉన్నత విద్య కళాశాలలకు చెందిన ఉన్నత ఆదాయ కుటుంబాల 12 నుంచి 30 ఏండ్ల లోపు యువత అధికంగా ప్రభావితం కావడం, తమ జీవితాలను నాశనం చేసుకోవడం గమనిస్తున్నాం. హైదరాబాదు జంట నగరాల పరిసరాల్లో పబ్‌ ‌కల్చర్లు, రేవ్‌ ‌పార్టీలు, వీక్‌ ఎం‌డ్‌ ‌విపరీతాలతో యువత డ్రగ్స్ ‌మత్తులో తూగుతున్నారు. 2022లో హైదరాబాదు పోలీసులు 556 కేజీల మరిజ్వానా, 12 లీటర్ల హష్‌ ఆయిల్‌, 586 ‌గ్రామ్‌ల కొకేయిన్‌, 295 ‌గ్రామ్‌ల హెరాయిన్‌, 743 ‌గ్రామ్‌ల ఎంజిఎంఏ, 356 గ్రామ్‌ల చరస్‌, 262 ‌గ్రామ్‌ల ఎల్‌ఎస్‌ఏ/ఎల్‌ఎస్‌డి బ్లాట్ల్ ‌జప్తు చేశారు. డ్రాగ్స్ అ‌క్రమ రవాణా, సరఫరాలో నైజీరియన్ల ప్రమేయం అధికంగా కనిపిస్తున్నది. డ్రగ్స్ ‌విష సంస్కృతి సినిమా పరిశ్రమలో విస్తృతంగా వ్యాపించి, నటులు/సాంకేతిక నిపుణులు పట్టుబడడం, ఆరోపణలు ఎదుర్కోవడం, సిట్‌ ‌విచారణకు హాజరు కావడం ఉన్నది. డ్రగ్స్ ‌రవాణాలో కొబ్బరికాయలు,బ్యాంగిల్స్, ‌ట్రక్స్, ఆటోరిక్షాలు, కార్ల డ్రైవర్ల మాద్యమాల ద్వారా డ్రగ్స్ అ‌క్రమ మార్గాలు ఉపయోగపడుతున్నాయి.

దక్షిణ భారతంలో మాదకద్రవ్యాల రవాణాలో హైదరాబాదు మహానగరం కేంద్ర బిందువు అవుతున్నదని బాధ్యతగల పౌరసమాజం భయపడుతున్నది. పిల్లలు, యువత కళాశాలలకు వెళ్లి ఏం చేస్తున్నారో తెలియక తల్లితండ్రులు తలలు పట్టుకుంటున్నారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ ‌వినియోగంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా విస్తరిస్తున్నది. డ్రగ్స్ ‌కేసులు బయట పడిన ప్రతిసారి సంబంధిత విభాగాలు ఎంక్వైరీ చేస్తున్నామని 2, 3 రోజులు హైరానా పడడం, ఆపైన మరిచి పోవడం సర్వసాధారణం అవుతున్నది. అక్రమ రవాణా, అమ్మకందారులు, వినియోగదారులను వల వేసి పట్టుకొని కఠిన శిక్షలు వేయాలని, బానిసలైన పిల్లలు/యువతను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి ఆరోగ్యకరమైన సమాజ స్థాపన చేయడంలో మనందరం భాగస్వాములు అవుదాం. డ్రగ్స్ ‌వాసనలు కూడా కనిపించని భారతాన్ని నిర్మించుకుందాం.
‘‘లెట్‌అజ్‌ ‌సే నో టు డ్రగ్స్ – ‌డ్రగ్స్ ‌వద్దని నినదిద్దాం’’

-మధుపాళీ
9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page