దేశానికి ఆదర్శంగా తెలంగాణ పాలన

  • కెసిఆర్‌ ‌నాయకత్వంతో మారిన ముఖచిత్రం
  • అభివృద్ధి నమూనాలు కోకొల్లులగా అమలు
  • మళ్లీ కెసిఆర్‌ ‌నాయకత్వాన్ని బలపరచాలి
  • ఐడిసి ఛైర్మన్‌ ‌వేణుగోపాలాచారి పిలుపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని మాజీ కేంద్రమంత్రి,ఐడిసి ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి అన్నారు. పేదల మేలు కోసం రాష్ట్ర సర్కారు అమ లు చేస్తున్న పథకాలకు మెచ్చే వివిధ పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పథకాల అమలు, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతున్నది చెప్పారు. ప్రజల్లో ఉన్న పాపులారిటీకి ఇది కూడా ఓ నిదర్శనమని అన్నారు. ఇంకా భారీగా వలసలు కొనసాగుతాయన్నారు. పార్టీ అభివృద్ధి కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని హా ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌మన రాష్టాన్న్రి ఏండ్లకేండ్లు పాలించినా.. చేసిందే లేదన్నారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు ప్రజలకు అందించాలన్న ఆలోచన గతంలో కనీసంగా కూడా వారికి రాలేదు. ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎటు చూసినా అస్తవ్యస్తమే. ప్రజలకు అన్నీ అవస్థలే. ఇప్పుడేమో ఎన్నికలు వస్తున్నాయని గ్యారెంటీలంటూ నమ్మిస్తున్నారని అన్నారు.

వారి పాలనలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం చేతగానోళ్లు.. ఇప్పుడు చేస్తరా..అన్నది రే ఆలోచించాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లలోనే రాష్టాన్న్రి గొప్పగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ ‌నాయక్వతం కావాలా.. 50 ఏండ్లు అధికారంలో ఉండి కరెంటు ఇవ్వక, నీళ్లు ఇవ్వక, కనీసం యూరియా ఇవ్వక వ్యవసాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం కావాలా.. ఆలోచించుకోవాలని రైతులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సంక్షేమ పథకం అమలవుతుందని, సంక్షేమానికి కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కేసీఆర్‌ ‌సర్కారు నిలుస్తున్నదని కొనియాడారు. తెలంగాణ సాధించుకున్న పదేండ్లలోనే  మార్పు ఏర్పడిందన్నారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు గత పాలకులు ఎప్పుడూ కూడా ప్రజలకు అందించాలన్న ఆలోచన చేయలేదన్నారు. కనీసం ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. తెలంగాణ రాకపోతే 24 గంటల కరెంటు వచ్చేదా..? ఒకసారి ఆలోచించాలని సూచించారు.

కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌మాట్లాడుతున్నారని, కేవలం మూడు గంటలు సరిపోతుందని ఎద్దేవా చేశాడని గుర్తుచేశారు. నిజంగా రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందా. అన్నది నిలదీయాలని అన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వస్తే మనకు అదేగతి పడుతుందన్నారు. కాంగ్రెస్‌ ‌హాయంలో ప్రభుత్వ దవాఖానాల్లో రోగి చేరితే ఇంటికి వచ్చే పరిస్థితులు లేకపోలేదన్నారు. ఇవ్వాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కార్పోరేట్‌ ‌దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దారని, మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాలు పల్లె ప్రకృతి, వైకుంఠధామాలు, ఇంటింటికీ మంచినీళ్లు, సీసీ రోడ్లు లాంటి సౌకర్యాలతో అంచలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మళ్లీ బీఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పాటైతే మరిన్ని సౌకర్యాలు వస్తాయన్నారు. ఎన్నికలు తొందరలోనే ఉన్నాయని,  బీఆర్‌ఎస్‌ అం‌తా ఓటేసి మళ్లీ గెలిపించుకోవాలని సూచించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు.

సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి మహిళ మద్దతుగా ఉండాలని సూచించారు. ఎన్నో పార్టీలు ఈ రాష్టాన్న్రి 60 ఏండ్లపాటు పాలించాయని, కానీ ఇంకా ఇల్లు, భూమి లేకుండా ప్రజలు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఎవరో ప్రజలు గ్రహించా లన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక పల్లెలు, పట్టణాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నా మన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేయని గ్రామం, సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ ‌పాలనలోనే రాష్ట్రంలో సబ్బండవర్గాలకు మేలు జరుగుతున్నదని పేర్కొన్నారు. ఎంతో మంది నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చారన్నారు. గత పాలకులు నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి, డబ్బులు తీసుకొని మోసం చేశారన్నారు. ఇప్పుడు సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు ఇస్తున్నారని చెప్పారు. ఇంకా పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయడానికి కల్యాణ లక్ష్మి పథకంతో భరోసా కల్పిస్తున్నారని వివరించారు.ప్రజలంతా ఆలోచించి కెసిఆర్‌కు మద్దతుగా నిలవాలని వేణుగోపాలాచారి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page