ఐటి చెల్లింపుల్లో పారదర్శకతకే కొత్త చట్టాలు

చట్టాలపై అవగాహన తప్పనిసరి
స్వచ్ఛంద సంస్థలకు రిజిస్ట్రేషన్ అవసరం
సదస్సులో ఐటి కమిషనర్ బాలకృష్ణ
కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 :  ఆదాయపన్ను చెల్లింపులు, రాయితీలపై స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో ఇటీవల చేసిన సవరణలపై అవగాహన తప్పనిసరని ఇన్ కమ్ టాక్స్ (ఎగ్జెన్షన్స్) కమిషనర్ బి బాల కృష్ణ అన్నారు. స్వచ్ఛంద సంస్థలు లాక్యానికి అనుగుణంగా పనిచేయాలని లేనిపక్షంలో  వాటి రిజిస్ట్రేషన్ రద్దు అవుతుందని పేర్కొన్నారు. సంస్థల సేవలు పారదర్శకంగా ఉండేందుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. ఐటి శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని లేక్వ క్లబ్ (సీక్వేల్ రిసార్స్)లో సోమవారం ఔచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా ఎపి, తెలంగాణ, ఒడిస్సా మూడు రాష్ట్రాల ఇన్ కమ్ టాక్స్ (ఎగ్జెన్షన్స్) కమిషనర్ బి బాల కృష్ణ, ఆదాయపు పన్ను (మినహాయింపులు) హైదరాబాద్‌ రేంజ్‌ జాయింట్‌ కమిషనర్  వి కోటేశ్వరమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ కమ్ ట్యాక్స్ రిటన్స్ చట్టాలపై ప్రజల మనస్సులో ఉన్న  సందేహాలను, సమస్యలను నివృత్తి చేసేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓ వ్యక్తి ఆర్థిక ప్రణాళికలో ఆదాయ పన్ను మినహాయింపు అనేది కీలకమైన అంశము, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్స్ అనేది సులభమైన విషయము అన్నారు. స్వచ్చందంగా సేవ చేయాలనే సద్గుణం ఉన్నవారికి ప్రభుత్వం తరుపు నుండి సహకారం అందించేందుకు ఓ చట్టాన్ని రూపొందించిందన్నారు. దీనికి 1961లో ప్రభుత్వం చట్టం చేసిందని గుర్తు చేశారు. భారత దేశంలో స్వచ్ఛంద సేవలను పెద్దగా పట్టించుకోలేదన్నారు. కాలానికి అనుగుణంగా చారిటీ కంట్రోల్  ఆడిటర్ జనరల్ స్వచ్ఛంద సంస్థల సేవల నిర్వహణపై లోతైన అధ్యాయనం చేసిందన్నారు. అనందా ఎడ్యుకేషన్ సొసైటీ చారిటీ రిజిస్ట్రేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం చారిటీ సేవలను రెండుగా విభజించిందన్నారు.  కొత్తగా ప్రారంభించే సంస్థలు, అనుమతి పొంది సేవలు అందిస్తున్న సంస్థలుగా చేసిందన్నారు. ట్రస్టుల నమోదు ప్రక్రియను పారదర్శకం చేయడానికి సెక్షన్ 12ఎబి అమలులోకి తెచ్చిందని తెలిపారు. దీని ప్రకారం, ట్రస్టులు మునుపటి సెక్షన్ 12ఎఎ నుండి సెక్షన్ 12ఎబి కొత్త నిబంధనకు మారాల్సి ఉంటుందన్నారు. 2021 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన తాజా రిజిస్ట్రేషన్ ను పొందాలని స్పష్టం చేశారు. ట్రస్టులు ప్రాథమికంగా  పబ్లిక్, ప్రైవేట్ ట్రస్ట్ అని రెండు రకాలని పేర్కొన్నారు. పబ్లిక్ ట్రస్ట్ అనేది స్వచ్ఛంద సేవాసంస్థలు,  ధార్మిక సంస్థలకు సంబంధించిన ట్రస్టులుగా వర్గీకరించబడిందన్నారు. . ట్రస్టు స్థాపించే బాధ్యతను స్వీకరించే వ్యక్తి ట్రస్టీ  అని,  భవిష్యత్తులో ట్రస్ట్ నుండి ప్రయోజనాలను పొందేందుకు సిద్ధంగా ఉన్న – వ్యక్తిని లబ్ధిదారుడని అంటామన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ (ఐటిఎ) సెక్షన్ 12ఎ, 12ఎఎ, 80జి సెక్షన్ల కింద ట్రస్ట్, ధార్మిక సంస్థల ఆదాయపు పన్ను రాయితీ ప్రయోజనాల ను పొందవచ్చు అన్నారు. సంస్థల ఆర్థిక లావాదేవీలను ప్రభుత్వం గుర్తించేందుకు 12ఎ ఉపయో గ పడుతుందన్నారు. సెక్షన్ 12ఎ ధార్మిక ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలకు వర్తిస్తుందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page