మోత్కుపల్లి దీక్షకు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సంఘీభావం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టిన తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షులు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సంఘీభావం తెలిపారు. చంద్ర బాబు అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన ఆయన.. చంద్రబాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా గొంటి కుమార్ చౌదరి యాదవ్ మాట్లాడుతూ ప్రజల కోసం రూ.7, 8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు అని అన్నారు. అలాంటి వ్యక్తి రూ.300 కోట్లకు ఆశపడతారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్​ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. జైలులో చంద్రబాబుకు ఏమైనా జరిగితే.. పూర్తి బాధ్యత జగన్​దేనని హెచ్చరించారు. అలాగే చంద్రబాబు అరెస్టుపై సీఎం కేసీఆర్​ రాజకీయాలు పక్కన పెట్టి స్పందించాలని సూచించారు. అవకాశం ఉంటే బాబును ములాఖత్‌లో కలుస్తానని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page