హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు

టీఎస్పీఎస్సీపై ప్రభుత్వానికి సిగ్గుండాలి
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది
బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌తెలంగాణ పబ్లీక్‌ ‌సర్వీస్‌ ‌కమిసన్‌ ‌గ్రూప్‌-1 ‌పరీక్ష రద్దుపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ ‌స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిది అని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి.. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది.. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాల కోసం.. 1952లో ఇడ్లీ సాంబార్‌ ‌గో బ్యాక్‌ ఉద్యమంలో ఏడు మంది మరణించారు.. 1969 ఉద్యమంలో 369 మంది చనిపోయారు.. మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది అమరులయ్యారు అంటూ ఈటెల రాజేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను, అవుట్సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ ‌చేస్తానని.. కొత్త ఉద్యోగాలు నింపుతామని.. ప్రైవేట్‌ ‌లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ కేసీఆర్‌ ఇచ్చారు అంటూ ఈటెల రాజేందర్‌ ‌గుర్తు చేశారు. కానీ కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు అంటూ ఆయన మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు వేస్తే 17 పేపర్లు లీక్‌ ‌చేసి వారి నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు.. టీఎస్పీఎస్సీ గ్రూప్‌ ‌వన్‌ ‌పరీక్ష రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు.. ఇప్పటికైనా కేసీఆర్‌ ‌మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలి.. ఎన్నికలు పైసలు, మద్యం పంచుడు ఇవన్నీ కాదు.. కేసీఆర్‌ ‌వచ్చిన తర్వాత ఒరగబెట్టింది ఏమీ లేదు.. టీఎస్పిఎస్సి గ్రూప్‌-1 ‌పరీక్ష రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని ఈటెల రాజేందర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page