వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో (1946 -1951) 3వేల గ్రామ రాజ్యాలు స్థాపించి 10 లక్షల భూములు భూస్వాముల చెర నుండి విడిపించి ,అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ 3 వేల మంది కమ్యునిస్ట్ యోధులు అమరులు అయినారు. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణా పీడిత ప్రజల అధికారం కొరకు జరిపిన విముక్తి పోరాటం అయితే, విలీనం పేర కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం సర్కార్ మధ్య నడిచిన రాజీ నాటకం తో తెలంగాణా లక్షలాది ప్రజల పై పటేల్ సైన్యం జరిపిన మారణకాండ ను కీర్తించే బూర్జువా భూస్వామ్య వర్గాల ద్రోహాన్ని విలీన దినము అని కీర్తించడం విద్రోహము కదా..రైతుల, కూలీల, కార్మికుల, వివిధ అణిచివేత కులాల విముక్తి కోసం జరిపిన పోరాటం ఓడిపోయి నైజాం రాజ్యం లోని కరుడు గట్టిన భూస్వామ్య అధికారం నుండి బూర్జువా నాయకత్వం లోని భూస్వామ్య పెట్టుబడి దారీ వర్గాలకే అధికారం చట్టబద్దం చేయడమే తెలంగాణ విలీనం.
నైజాం ఫ్యూడల్ రాజ్యాన్ని దెబ్బతీయడం లో కమ్యునిస్ట్ నాయకత్వంలో శూద్ర కులాలకు చెందిన రైతు కూలీల పునాదిగా వున్న ప్రజల పోరాటాలు త్యాగాలు చేస్తే విలీనం ద్వారా లబ్ధి పొందింది అగ్ర కులాల లోని భూస్వామ్య బూర్జువా వర్గాలు మాత్రమే. ఈ సత్యాన్ని మరుగు పరిచి విలీన దినం జరుపడం నేడు రివిజనిస్ట్ కమ్యునిస్ట్ ల దోపిడీ వర్గాలకు భజన చేయడాన్ని గుర్తు చేస్తుంది. నేడు వీరు తెలంగాణ పోరాట వారోత్సవాలు జరుపడంలో ప్రజల పోరాట చరిత్ర ను చెప్పడం వరకు మాత్రమే సరి అయింది.కానీ విద్రోహన్ని బహిర్గత పరచడం పై కేంద్రీకరించకుండా విలీన దినం జరుపడము మరొక రకమైన విద్రోహ పాత్రనే. సాయుధ పోరాట దిన స్ఫూర్తి ని కూడా పాలక వర్గాల అధికారానికి తమ కు నాలుగు సీట్ల కోసం చేస్తున్న హంగామా గా తప్ప నిజమైన పోరాట స్ఫూర్తి కాదు.
హిందూ ముస్లిం క్రైస్తవ భూస్వామ్య వర్గాలకు బ్రిటిష్ వలస వాదులందరికి పూర్తిగా నమ్మక మైన బానిసగిరి చేసి నేడు చరిత్ర ను కట్టు కథలతో మత ఉన్మాదం నింపే ప్రయత్నాలు దుర్మార్గ మైనవి. సీపీఐ తరువాత సీపీఎం పాలక వర్గాల పాద సేవ తరువాత గొప్ప నక్సల్బరీ భూస్వామ్య బూర్జువా వర్గాలకు వ్యతిరేకంగా కచ్చితమైన వర్గ పోరాటాన్ని బరీ గిసి నిలిచింది.వీర తెలంగాణ సాయుధ పోరాట అనుభవాల తో నూతన పద్దతుల్లో ముందుకు తీసుకు పోవడానికి కృషి చేసింది.గడిచిన 70 యేండ్ల లో ప్రపంచం లో దేశం లో తెలంగాణ లో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చినాయి.నేడు వీర తెలంగాణ నాటి భూస్వామ్య వ్యవస్థ అధిపత్యం కాకుండా బూర్జువా వర్గాల అధిపత్యం కొనసాగుతూ వున్న స్థితి లో బూర్జువా వర్గ దోపిడీ అణిచి వేతలకు వ్యతిరేకంగా రాజీ లేని వర్గ పోరాటం నడుపడం మాత్రమే వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ని ఎత్తి పట్టగలము. వీర తెలంగాణ సాయుధ పోరాట దినం అంటే కాంగ్రెస్ నాయకత్వం లోని బూర్జువా భూస్వామ్య దోపిడీ వర్గాలు చేసిన విద్రోహమే. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ని ఎత్తి పట్టడం అంటే ,3 వేల మంది కమ్యునిస్ట్ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం అంటే వారి ఆశయ మైన దోపిడీ, వివక్ష, అణిచివేత లేని శ్రామిక రాజ్య స్థాపన కోసం పోరాడటం మాత్రమే.
– మాజీ మావోయిస్ట్ నేత జంపన్న