ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై అసత్య ప్రచారాలు మానుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు ఎంపీపీ అనిత విజయ్ కల్వకుర్తి శాసనసభ్యులు  జైపాల్ యాదవ్ పై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని బిఆర్ఎస్ నాయకుడు జంతుక కిరణ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ.. బి ఆర్ఎస్ పార్టీపై బురద జల్లే పనులు మానుకోవాలని హితువు పలికారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ప్రజల ఆదరణ లేకపోతే ఎలా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారనీ ఆయన అన్నారు. మేడిగడ్డ ఎంపిటిసిగా బిఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. ఎంపీటీసీల సహకారంతో ఎంపీపీగా ఆ సీటుపై కూర్చోబెట్టింది ఎమ్మెల్యే కదా.. అని గుర్తు చేశారు. అందరూ సమన్వయంతో కలిసిమెలిసి ఉండి జైపాల్ యాదవ్ గెలుపుకు కృషి చేయాల్సింది పోయి, ఆమనగల్లు మండల పరిషత్ ఆఫీసులో బయట వ్యక్తులను తీసుకువచ్చి పార్టీ కండువాలు కప్పి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అవమానపరిచే విధంగా మాట్లాడడం సమంజసంగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బైండ్ల భీమయ్య, కాలే విక్రం, వి. రంజిత్, కొమ్ము ప్రసాద్, అబ్బు, అప్సర్, గుండ మల్ల రాములు, శ్రీరామ్, విజయ్, పాషా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page