పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి
ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలి
సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర
టికెట్ విషయంలో కేసీఆర్ మనసు మారాలని ప్రార్థన.
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: నీలం మధు ముదిరాజ్ రాక కోసం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను అన్నారు.పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కి కేటాయించాలని కోరుతూ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ ముదిరాజ్ సంఘానికి చెందిన 30 మంది చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ పై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. చాలా సంవత్సరాలుగా నిరంతరం ప్రజలలో ఉంటూ స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీఅర్ఎస్ పార్టీకి విధేయుడుగా పనిచేసిన నీలం మధు ముదిరాజ్ కు పటాన్ చెరు టికెట్ కేటాయించాలని కోరారు.65 లక్షల జనాభా గల ముదిరాజ్ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క టికెట్ కేటాయించకపోవడం సరికాదన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం ప్రజలంతా సబండ వర్గాల నేత నీలం మధు వైపే చూస్తున్నారని నీలం సేవలు తమకు అవసరమని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోని నీలం మధు కు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారాలని ఆ గణపతి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ చిట్కుల్ గ్రామం నుంచి గణేష్ గడ్డలోని గణేష్ టెంపుల్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి, నర్సింలు,వెంకటేశ్,సంజీవ్,శ్రీ ను,స్వామి,శ్రీను,జంగయ్య,నరేష్, రాము,రాజు, విష్ణు,ప్రశాంత్, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నా.