అధైర్యపడొద్దు… మీ భవిష్యత్‌కు అండగా ఉంటాం..!

గుంట జాగ లేకపోయినా ఎవుసంపై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. ఆరు గాలం కష్టించి సాగు చేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారు. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతనను అనుభవిస్తున్నారు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు.

రాష్ట్రంలో మీ లాంటి రైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40 శాతం మేర సాగు భూమిని మీ అధీనంలోనే ఉంది. అయినా ప్రభుత్వం మీపై కనికరం చూపడం లేదు. దీంతో బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. పంట నష్టపోతే పరిహారం అందకపోవడం, అధిక వడ్డీ భారంతో అప్పుల ఊబిలో కూరుకోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం మంది మీలాంటి వారే ఉండటం విషాదకరం. అయిన ఏ మాత్రం కనికరం లేని పాషాణ హృదయుడైనా కేసీఆర్‌ ‌మీ లాంటి వారిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోదని శాసనసభ వేదికగా తేల్చిచెప్పారు.

సొంత భూమి లేని మీ లాంటి రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరవడంతోపాటు, గిట్టుబాటు ధర దక్కక కుదేలవుతున్నారు. కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి సాగులోకి దిగినా భవిష్యత్‌ ‌మీద బెంగ గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న మీ లాంటి రైతులను ఆదుకోకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కౌలు గాలికొది లేశాయి.

మరో వైపు ప్రభుత్వ ప్రణాళిక లోపం, విధాన రాహిత్యం కారణంగా తెలంగాణలో వ్యవసాయరంగం పరిస్థితి దయనీయంగా తయారైంది. కేసిఆర్‌ అనాలోచిత విధానాలతో తెలంగాణలో పంటల వైవిధ్యం దెబ్బతినడమే కాక, రైతులు ఘోరంగా నష్టపోయారు. కేసీఆర్‌ ‌తలతిక్క విధానాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం  ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీపై గురుతరబాధ్యత ఉంది.ఇక్కడ రైతాంగాన్ని కాపాడు కోవా ల్సిన అనివార్యత ఉంది. తెలంగాణలో సాగుకు పూర్వ• ••భవం తేవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉంది. అందుకే పరిస్థితులను విశ్లేషించి సాగు చేసే ప్రతి ఒక్కరికి భరోసా కల్పించడానికి కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు డిక్లరేషన్‌ ‌కు రూపకల్పన చేసింది. గతేడాది మేలో  రాహుల్‌ ‌గాంధీ గారి సమక్షంలో వరంగల్లో రైతు డిక్లరేషన్‌ ‌ప్రకటించింది.

రైతు డిక్లరేషన్‌ ‌ప్రకారం ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చాం. ఉపాధి హామీ లో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని మాట ఇచ్చాం.  రైతులు పండించిన అన్ని పంటలకు  మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చా. మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి… ప్రకృతి విపత్తుల వల్లనో, మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టం అంచనా వేయించి… నష్ట పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చాం.

రైతుల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే వరంగల్‌ ‌డిక్లరేషన్‌.  ‌రైతులను గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవో చేస్తాయని ఆశలు పెట్టుకోవడం దండగ. ఎవరూ నిరాశను లోనుకావద్దు. ఆ ధైర్యపడొద్దు. మీ భవిష్యత్‌ ‌కు కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుంది. రాబోయే వంద రోజుల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ తలరాతను మారుస్తుంది.
రైతు రాజును చేసే దిశగా వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ ‌సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తుంది. చారిత్రకంగా చూసిన ఎవరు రైతు పక్షమో తెలిసిపోతుంది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచనకు నాంది పలికిందే కాంగ్రెస్‌. ‌కౌలురైతు కూడా రైతేనని, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలతో సహా అన్ని పథకాలను వర్తింపజేస్తూ గతంలో కౌలు రైతుల గుర్తింపు చట్టం చేసింది కాంగ్రెస్‌.
‌రైతులకు పావలావడ్డీకే రుణాలు, పంటల బీమా, రైతు బీమా, ఇందిర జలప్రభ, రాయితీ విత్తనం, ఇన్‌పుట్‌ ‌సబ్సిడీలు, పండిన పంటకు మద్దతు ధర, పంటల కొనుగోలుకు ఐకేపి కేంద్రాల ఏర్పాటు వంటి సమగ్ర రైతు అనుకూల నిర్ణయాలతో వ్యవసాయాన్ని పండగ చేసింది కాంగ్రెస్‌.

‌వరంగల్‌ ‌డిక్లరేషన్‌ను అగ్ర నాయకత్వం నుంచి కార్యకర్త వరకు భగవద్గీతగా భావిస్తున్నారు. తెలంగాణలో రైతు రాజ్యస్థాపనే కాంగ్రెస్‌ ‌లక్ష్యం. వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ ‌లో ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసి తీరుతాం. రైతులెవ్వరూ ఆధైర్యపడొద్దు. కాంగ్రెస్‌ ‌పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది. సాగు చేసే ప్రతి రైతు కష్టాలను తీరుస్తామని మరోసారి టీపీసీసీ అధ్యక్షుడిగా మాట ఇస్తున్నా.
image.png
ఎ. రేవంత్‌ ‌రెడ్డి,
ఎంపీ – మల్కాజ్‌ ‌గిరి,
టీపీసీసీ అధ్యక్షుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page