ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : ఈనెల 10 నుంచి 13 వరకు గోవాలోని పెడెమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, న్యూ మపుసా వేదికగా యూత్ గేమ్ ఫెడరేషన్ ఇండియా జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులకు స్థానం లభించిందని యూత్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెపి.హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఫుట్బాల్ అండర్ 17 బాలుర, కబడ్డీ అండర్ 17 బాలికలు, అథ్లెటిక్స్ 100 మీటర్లు, అండర్ 8, 100 మీటర్ల బాలురు, బాలికలకు స్థానం లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 17 ఏళ్లలోపు ఫుట్బాల్ ప్రథమ స్థానం, 17 ఏళ్లలోపు కబడ్డీ ప్రథమ స్థానం 100 మీటర్ల కింద 8, 2వ స్థానం 3వ స్థానం 100 మీటర్ల అండర్ 14 1వ స్థానం, 2 వ స్థానాలు లభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గ్యారా నరేష్, కోచ్ ఎఎస్.జోన్స్ మేనేజర్ రాందాస్ హ్యాండ్ కాసిం బాషా పాల్గొన్నారు.