ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : విదేశాలలో ఉన్నత చదువులు చదువుకొని , ఉన్నత శిఖరాలను వెళ్లాలనుకొనే విద్యార్థులకు తమ అబ్రాడ్ స్టడీ ప్లాన్ కన్సల్టెన్సీ తోడ్పాటును అందిస్తుందని సంస్థ ఎండీ అనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలో వారు మాట్లాడుతూ యూరప్ దేశాలలో ఉన్నత చదువులతో పాటు, జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్న నిరుద్యోగ యువతకు జాబ్ పర్మిట్ వీసాను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కన్సల్టెన్సీ నుండి విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారితో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇప్పటి వరకు వారి అబ్రాడ్ స్టడీ ప్లాన్ కన్సల్టెన్సీ ద్వారా 400 మంది విద్యార్థులు ఇటలీ తదితర యూరప్ దేశాలలో చదువుకొని స్థిరపడ్డారని వివరించారు. విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఫెక్ కాన్సెల్టెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని… వారి మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ముందస్తుగా అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతే అక్కడికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.